Samantha posts her first pic on Instagram since split with Naga Chaitanya, writes about 'songs of old lovers': 
విడాకుల అనంతరం సమంత (Samantha) సోషల్‌మీడియాలో తొలిసారిగా ఓ పోస్ట్‌ షేర్‌ చేశారు. అక్టోబర్‌ 8న జరిగే లాక్‌మీ (Lakme) ఫ్యాషన్‌ షో ప్రమోషన్‌లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఈ పోస్ట్‌ షేర్‌ చేశారు. సమంత ఫ్యాషన్‌ షోకు సంబంధించిన పోస్ట్‌గా.. పోస్ట్ చేసిప్పటికీ ఆ పోస్టులో.. సామ్ రాసుకొచ్చిన క్యాప్షన్‌ కాస్త ఆసక్తికరంగా ఉంది. కాగా ఈ రోజు సమంత-చైతన్య (samantha‌‌-chaitanya) పెళ్లి రోజు. కాలం వారిపై పగబడ్డి వేరుచేసింది కానీ లేదంటే ఇవ్వాళ వారిద్దరూ నాలుగో వివాహ వార్షికోత్సవం జరుపుకునే వారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


వైట్‌ కలర్‌ డ్రెస్‌లో.. వైట్‌ అండ్‌ పింక్‌ కలర్‌ పూలు (rose flowers) తలలో పెట్టుకుని కిందికి చూస్తున్న తన ఫొటోను ఇన్‌స్టాలో (instagram) షేర్‌ చేసింది సామ్. బాగా భావోద్వేగానికి లోనవుతూ పోస్ట్ చేశారు. త్వరలో జరిగే ఫ్యాషన్‌ షో కోసం తను ఎదురు చూస్తున్నట్లు ఈ పోస్ట్‌ ద్వారా ఆమె పేర్కొన్నా.. ఇందులో మరెదో లోతైన అర్థం వచ్చేలా పోస్ట్ చేసింది. "పాత ప్రేమ పాటలు - పర్వతాలు. శిఖరంపై శీతాకాలపు గాలి సవ్వడులు.. కొన్ని పొగొట్టుకున్న పాత చిత్రాల పాటలు దొరికినప్పుడు... లోలోపలి బాధను ప్రతి ధ్వనించే ఆ ప్రేమ పాటలు" అంటూ చాలా ఎమోషనల్‌గా (emotional) ఆ పోస్ట్ ఉంది.



 


Also Read : Prabhas25: ప్రభాస్ 25వ సినిమాకు 'స్పిరిట్' అనే టైటిల్ ఖరారు..పోస్టర్ రిలీజ్!


అక్టోబర్‌ 2న తన భర్త, టాలీవుడ్‌ హీరో నాగ చైతన్యతో (Naga Chaitanya) విడిపోతున్నట్లు సమంత ఇన్‌స్టాలో అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత నుంచి సోషల్‌మీడియాలో(social media) వీరి విడాకుల గురించే చర్చ సాగుతోంది.



 


ఇక గత పెళ్లి రోజున సమంత చేసిన పోస్ట్‌ను కూడా ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ''నేను నీ దాన్ని.. నువ్వు నా వాడివి.. ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం.. హ్యాపీ యానివర్సరీ హస్బెండ్‌'' అంటూ గతేడాది పెళ్లి రోజు పోస్ట్ చేసింది సమంత (Samantha).



 


ఇక తాజాగా షూటింగ్‌లో పాల్గొన్న సమంత తన విడాకులు విషయంపై భావోద్యేగానికి లోనైనట్లు సమాచారం. విడాకుల తరువాత సమంత తొలి సారి కెమేరా ముందుకు వచ్చారు. ఒక యాడ్ షూటింగ్ లో (add shooting) పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని (hyderabad) ముకరంజా జానియర్‌ కాలేజీలో ఇందుకు సంబంధించి షూటింగ్‌ జరిగింది. సమంత ముందుగా ఒప్పుకున్న మేరకు షూటింగ్ కు వచ్చింది. అయితే షూట్‌ గ్యాప్‌లో సమంత (Samantha) తీవ్ర భావేద్వేగానికి లోనై కంటతడి పెట్టుకుందంట.



 


Also Read : Chaysam Divorce: ప్రీతంపై పెరిగిన ట్రోల్స్..స్పందించిన సమంత మేకప్ ఆర్టిస్ట్‌ సాధనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 



మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook