Samantha-KTR: సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది సమంత. తన ఆరోగ్య సమస్యల వల్ల కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్.. సోషల్ మీడియాలో మాత్రం తన జోరు తగ్గివ్వలేదు. సమంత తరచుగా ఫోటోలు షేర్ చేయడమే కాకుండా.. ఇతర సెలబ్రిటీస్ పోస్టులకు కామెంట్స్ కూడా పెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో సమంత తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ షేర్ చేసిన ఒక పోస్టుకు పెట్టిన కామెంట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కూడా సోషల్ మీడియాలో తెగ యక్టివ్ గా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. రాజకీయంగానే కాకుండా సామాజికంగా, అత్యవసరమైన వారి అభ్యర్థనలకు సైతం కేటీఆర్ సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. ఇందులో మరింత ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ఆ పోస్ట్ కి వెంటనే సమంత కామెంట్ పెట్టడం. దాంతో ఆ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు కేటీఆర్ పోస్ట్ కన్నా కూడా సమంత కామెంట్‌కు నెటిజన్లు రిప్లయ్స్‌ మీద రిప్లయ్స్ పెడుతున్నారు. ఇంతకీ కేటీఆర్ ఏం పోస్ట్ చేశారు? సమంత ఏం కామెంట్  పెట్టిందో ఒకసారి చూద్దాం..


ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కేటీఆర్ చుట్టూ జనాల మధ్య తాను చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోకి కింద క్యాప్షన్ గా ‘జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా.. చిరునవ్వుతో ఎదుర్కోవాలి’ అంటూ రాసుకువచ్చారు. ఇక ఈ పోస్ట్ కి ఫస్ట్ కామెంట్ సమంత పెట్టడం విశేషం. కేటీఆర్ షేర్ చేసిన పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా .. ఆ ఫోటోకు ‘నమస్తే’ ఎమోజీని కామెంట్‌గా పెట్టింది ఈ హీరోయిన్. 


ఇక సమంత పెట్టిన కామెంట్ కి నెటిజన్లు రకరకాల  అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సమంత కామెంట్ వల్ల ఈ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


 



Also Read: Pawan Chiranjeevi Meet: పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి ఆశీర్వాదం.. రూ.5 కోట్ల విరాళంతో భరోసా ఇచ్చిన 'అన్నయ్య'


Also Read: Pawan Kalyan: జగన్‌లాంటి 'కోడిగుడ్డు' ప్రభుత్వం ఇంకా కావాలా? పవన్‌ కల్యాణ్‌


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook