Samantha Ruth Prabhu : నేను తీసుకున్న ప్రతీ నిర్ణయం సరైనదే.. సమంత కామెంట్స్ వైరల్
Shaakuntalam Movie Script సమంత శాకుంతలం సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడింది. అసలే సమంత ఇప్పుడు ప్రమోషన్స్ కోసం బయటకు వచ్చేంత ఖాళీగా లేదు. యశోద సినిమాకు ఇచ్చినట్టుగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చి చేతులు దులుపుకునేలా ఉంది.
Samantha Ruth Prabhu Shaakuntalam సమంత ఈ శాకుంతలం సినిమాను ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఓకే చేసిందో అందరికీ తెలిసిందే. సమంత కరోనా కంటే కాస్త ముందుగా.. ఫ్యామిలీ మెన్ సీజన్ 2 కోసం సమంత ఎంతో ఫిట్‌గా ఉన్న సమయంలో ఈ శాకుంతలం స్క్రిప్ట్ వచ్చింది. సమంత సైతం అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉందని, ఎక్కువ టైం అయితే ఇవ్వలేను అని చెప్పినట్టుగా నీలిమ గుణ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
అయితే శాకుంతలం పాత్రకు తాను సెట్ అవుతానో లేదో ఎలా ఉంటుందో అని ట్రయల్ షూట్ చేశారట. ఒళ్లంతా నగలు నింపేసి, శాకుంతలం పాత్రకు తగ్గట్టుగా రెడీ చేశారట. గుణ శేఖర్ అది చూసి ఏం మాట్లాడుకుండా ఉన్నారట. ఎందుకంటే ఆ టైంలో సమంత కండలు తిరిగిన దేహం, పొట్ట భాగంలో పలకల దేహం ఉండటం, భుజాలు కాస్త బలంగా ఉండటంతో ఆ పాత్రకు సెట్ కాదని అనుకున్నాడేమోనట.
అప్పుడు తాను వేరే పాత్ర కోసం రెడీ అయ్యానని, దానికి తీసుకున్న ట్రైనింగ్ వేరు అని చెప్పింది సమంత. అయితే ఈ శాకుంతలం కోసం తన డైట్‌ను వర్కౌట్లను పూర్తిగా మార్చేశానని, మళ్లీ కాస్త సాఫ్ట్‌గా మారానని, నాన్ వెజ్ కూడా మానేసినట్టుగా చెప్పుకొచ్చింది. అయితే సినిమా కోసం తాను తీసుకున్న ప్రతీ నిర్ణయం సరైనదేనని, సినిమా చూశాక ఎంతో సంతృప్తిగా ఉందని, తాను తీసుకున్న నిర్ణయం సరైందేనని సమంత తెలిపింది.
ఒక సినిమాకు కొంత మంది వంద శాతం పని చేస్తారు.. కొంత మంది ఎనభై శాతం పని చేస్తారు.. ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు పని చేస్తారు.. అయితే ఈ సినిమాకు మాత్రం ప్రతీ ఒక్కరూ వంద శాతం కష్టపడి పని చేశారు.. సినిమా చూశాక నాకు అదే అనిపించింది.. అంటూ సమంత చెప్పుకొచ్చింది.
Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook