Samantha Ruth Prabhu Buys A Home: సమంతకు ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటించాలనే కోరిక పుట్టినట్టుంది. ఫ్యామిలీమెన్ సీజన్-2 అయ్యాక ఆమెకు బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చాయి. కానీ కరోనా సమయం అవ్వడం, ఆ తరువాత చైతో విడాకులు, ఆ తరువాత సమంతకు అనారోగ్యం వంటి కారణాలతో బాలీవుడ్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చిన సమంత.. బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిందట. ఈ క్రమంలోనే ముంబైకి షిఫ్ట్ అవ్వాలని ఫిక్స్ అయిందట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగానే సమంతకు సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. సమంత కొత్త ఇళ్లు కొనేసిందట. ముంబైలో పదిహేను కోట్లతో ఇళ్లు కొన్నదనే వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ వార్తల్లో ఎంత నిజం ఉన్నది సమంతకే తెలియాలి. వారి పీఆర్ టీంకే తెలియాలి. కానీ సమంత మాత్రం ముంబై మీద మనసు పడ్డట్టు అర్థం అవుతోంది. ఇకపై హైద్రాబాద్‌కు పూర్తిగా గుడ్ బై చెబుతుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది.


సమంత ఇప్పుడు తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని చూస్తోంది. సమంతకు బాగా లేకపోవడం వల్ల విజయ్ దేవరకొండ ఖుషి ఆగిపోయింది. శివ నిర్వాణ కూడా వేరే సినిమాను చూసుకుందామని అనుకున్నాడు. కానీ ఇంతలో సమంత కోలుకోవడం, షూటింగ్‌లకు ఓకే చెప్పడంతో మళ్లీ ఖుషీ పట్టాలెక్కింది.


ఈ నెల చివర్లోనే ఖుషీ సెట్‌లోకి సమంత వస్తుంది. అంతలోపు సిటాడెల్ సెట్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి సందడి చేస్తూ ఉంటుంది సమంత. ఇప్పుడు సమంత ముంబైకి మకాం మార్చిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక సమంత పూర్తిగా ముంబైలోనే ఉంటుందని, అప్పుడప్పుడు షూటింగ్‌ల కోసం హైద్రాబాద్‌కు వస్తుందని టాక్ వినిపిస్తోంది.


సమంత నటించిన శాకుంతలం సినిమాకు అడుగడునా ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన శాకుంతలం.. మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 17న రావాల్సిన ఈ సినిమాను దిల్ రాజు బృందం వాయిదా వేసింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్లు అనౌన్స్ చేయనున్నారు.


Also Read:  Ashu Reddy : జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం!.. అషూ రెడ్డి ముదురు కామెంట్లు


Also Read: Kiara Advani Wedding Pics : కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి.. రామ్ చరణ్ కామెంట్ ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook