Samantha Ruth Prabhu Face Makeup Mask సమంత ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటోంది. గత ఏడాది అనారోగ్యం వల్ల ఆరేడు నెలలు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు సమంత స్పీడందుకుంది. చకచకా సినిమాలు పూర్తి చేయాలని అనుకుంటోంది. అందుకే వరుసగా షూటింగ్‌లంటూ తిరుగుతోంది. షూటింగ్‌లు ఒకపక్క.. వర్కౌట్లు మరో పక్కా.. ఇలా తన ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ ఫుల్ బిజీగా ఉంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాకుంతలం త్రీడీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లోనూ సమంత కనిపించలేదు. అప్పుడు సమంత ముంబైలో ఉంది. సమంత లేకపోయినా కూడా శాకుంతలం ట్రైలర్‌ను హైద్రాబాద్‌లో దిల్ రాజు, గుణ శేఖర్‌లు రిలీజ్ చేశారు. అలా సమంత సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు కొన్ని సెట్స్ మీదున్నాయి. వాటన్నంటిని త్వరగా పూర్తి చేయాలని సమంత ఫిక్స్ అయింది.


ఇంత బిజీ షెడ్యూల్‌లో సమంత కారులోనూ టైం వేస్ట్ చేయొద్దని ఫిక్స్ అయినట్టుంది. సమంత కారులో ప్రయాణిస్తుండగా కూడా ఫేస్‌కు మాస్క్ వేసుకుంది. చేతిలో జపమాల పట్టుకుని ధ్యానం చేస్తోంది. ఇలా సమంత మాత్రం క్షణం కూడా వృథా చేయడం లేదనిపిస్తోంది. అయితే సమంత ఈ శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి విడాకులను తెరపైకి తీసుకొచ్చాయి.


[[{"fid":"267915","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


వివాహా బంధంలో తాను వంద శాతం ఇచ్చానని, అయినా వర్కౌట్ కాలేదని చెప్పుకొచ్చింది సమంత. అయితే పుష్పలో ఐటం సాంగ్ చేస్తానంటే మాత్రం వద్దని చెప్పడం, ఇంట్లోనే కూర్చోమని అన్నారంటూ సమంత బయటకు చెప్పేసింది. ఇలా తనను కట్టడి చేశారని, అందుకే విడాకుల వరకు వ్యవహారం వచ్చిందన్నట్టుగా సమంత వ్యాఖ్యలు చెబుతున్నాయి.


సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకేలతో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న ఖుషి సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లోనే సమంత సందడి చేస్తోంది.


Also Read:  Dasara Collection : రెండో రోజుకే బ్రేక్ ఈవెన్?.. దసరా మేనియా.. నాని రేంజ్ ఇదే


Also Read: Ameesha Patel Bikini : బికినీలో అమిషా పటేల్.. సీనియర్ భామ భారీ అందాల ప్రదర్శన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook