Samantha Ruth Prabhu Completes 13 Years సమంత హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టి నేటికి పదమూడేళ్లు అవుతోంది. సమంత, నాగ చైతన్య కలిసి నటించిన ఏ మాయ చేశావే సినిమా 2010లో ఫిబ్రవరి 23న వచ్చింది. ఈ మూవీతో సమంత ఒక్కసారిగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో నెగెటివ్ కామెంట్లను చూసింది. నటన సరిగ్గా రాదని, డ్యాన్సులు కూడా వేయడం లేదని అనేవారు. కానీ మెల్లిమెల్లిగా సమంత స్టార్డం పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు ఇండియన్ లేడీ సూపర్ స్టార్లలో ఒకరిగా నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పదమూడేళ్లలో సమంత సినీ కెరీర్ అద్భుతంగా సాగింది. సమంత నాగ చైతన్యల ప్రేమ, పెళ్లి, విడాకుల కథ అందరికీ తెలిసిందే. అయితే సమంతకు మాత్రం పెళ్లి తరువాతే ఎక్కువగా కలిసి వచ్చింది. నటిగా మంచి పేరు తెచ్చుకుంది. రంగస్థలం వంటి సినిమా చేసినా, సూపర్ డీలక్స్‌లో బోల్డ్ పాత్ర వేసినా, ఓ బేబీ అంటూ ప్రయోగం చేసినా, ఫ్యామిలీ మెన్ సీజన్‌ 2లో నటించినా సమంత తన మార్క్ వేసింది.


అయితే ఈ క్రమంలోనే నాగ చైతన్యకు, సమంతకు మధ్య దూరం పెరిగినట్టుంది. ఫ్యామిలీ మెన్ సీజన్ 2తోనే సమంత, చైతూల మధ్య బాగా గ్యాప్ ఏర్పడిందని అంతా అంటుంటారు. ఇక సమంతను కట్టడి చేయాలని అక్కినేని ఫ్యామిలీ భావించిందని, అందుకే సమంత ఇలా విడిపోయిందని చెబుతుంటారు. కానీ ఇందులో నిజం ఎంత ఉందనే విషయం వారికే తెలియాలి.


 



ఇక సమంత పర్సనల్ లైఫ్ ఎన్నో ఒడిదుడుకులతో ఉంటుంది. గత ఆరేడు నెలలుగా ఆమె పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే. మయోసైటిస్‌తో సమంత బెడ్డు మీద నుంచి కదల్లేని పరిస్థితుల్లోకి వెళ్లింది. బెడ్డు మీద నుంచే యశోద, శాకుంతలం సినిమాలకు డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడిప్పుడే సమంత మళ్లీ కోలుకుంటోంది. ఒకప్పటిలా స్ట్రాంగ్‌గా మారింది. వర్కౌట్లు చేస్తోంది. సినిమా 
సెట్లో అడుగుపెడుతోంది.


అయితే సమంతకు నటిగా పదమూడేళ్లు నిండటంతో అభిమానులు ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. దీంతో సమంత పేరు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. దీనిపై సమంత స్పందించింది. అభిమానుల ప్రేమను నేను ఫీల్ అవుతున్నాను.. నేను ముందుకు వెళ్లేందుకు తోడుంది ఈ ప్రేమనే.. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కూడా నేను నాలానే ఉన్నాను.. పదమూడేళ్ల అయ్యాయి.. అసలు ఆట ఇప్పుడే ప్రారంభం అయింది అంటూ చెప్పుకొచ్చింది.


Also Read:  Medical Student Preethi Suicide: ప్రీతి చనిపోయిందా..? అడ్డంగా బుక్కైన పూనమ్ కౌర్..నెటిజన్లు ఫైర్


Also Read: Anchor Rashmi Gautam : రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజన్‌.. యాంకర్ జబర్దస్త్ రిప్లై



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook