Vijay Samantha Kushi Movie సమంత విజయ్ నటించనున్న ఖుషి సినిమా పరిస్థితి ఎటూ తేలకుండాపోయింది. టక్ జగదీష్‌ సినిమా తరువాత శివ నిర్వాణ ఎంతో గ్రాండ్‌గా ఈ సినిమాను ప్రారంభించాడు. టక్ జగదీష్ సినిమాతో పోయిన పరువంతా కూడా ఖుషీ సినిమాతో తిరిగి తెచ్చుకోవాలని భావించాడు. ఇక విజయ్ సైతం లైగర్ సినిమా దెబ్బను ఖుషీతో తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ వీరందరి ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయింది. సమంతకు మయోసైటిస్ రావడంతో అంతా మారిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమంత విజయ్ కాంబోలో కాశ్మీర్‌లో ఓ లాంగ్ షెడ్యూల్‌ను షూట్ చేశాడు శివ నిర్వాణ. అయితే ఆ తరువాతే సమంతకు ఈ వ్యాధి బయటపడింది. కొన్ని రోజులు చికిత్స తీసుకుంటే సరిపోతుందని అంతా అనుకున్నారు. కానీ సమంతకు వ్యాధి అంతకంతకూ పెరుగుతూనే పోయింది. దీంతో సమంత గత కొన్ని నెలలుగా మంచానికే పరిమితమైంది. బెడ్డు మీద ఉండగానే యశోద సినిమాను ప్రమోట్ చేసింది. అతి కష్టం మీద బయటకు వచ్చిన కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇచ్చింది.


అయితే సమంత ఇప్పుడు కోలుకునేలా కనిపించడం లేదు. వైద్యులు ఇంకా విశ్రాంతి తీసుకోవాలని చెబుతూనే ఉన్నారట. దీంతో సమంత ఓ నిర్ణయం తీసుకుందట. ఇకపై సినిమాలను ఒప్పుకోకూడదని, ఆల్రెడీ ఒప్పుకున్న ఖుషి సినిమాను మాత్రం ఎలాగోలా నెక్ట్స్ మంత్ పూర్తి చేయాలని అనుకుంటోందట. 


ఆమె ఖాతాలో కొన్ని బాలీవుడ్ మూవీలు, వెబ్ సిరీస్‌లు కూడా వచ్చి పడ్డాయి. కానీ వాటికి వేరే వాళ్లని చూసుకోమ్మని సమంత టీం హింట్ ఇస్తోందట. ఇకపై కొత్త ప్రాజెక్టులు ఒప్పుకునేది లేదని, కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకోవాలని సమంత భావిస్తోందట. మరి సమంతకు ఆ వ్యాధి ఎప్పుడు తగ్గుతుందో.. మళ్లీ ఎప్పుడు సినిమాలతో బిజీగా అవుతుందో చూడాలి.


Also Read : Janhvi Kapoor Photoshoot : పొంగి పొర్లుతున్న ఎద అందాలు.. వామ్మో అనిపిస్తోన్న జాన్వీ కపూర్


Also Read : Bigg Boss 6 Telugu Winner : గెలిచినా ఓడినట్టు చేసిన నాగార్జున.. రేవంత్‌కు క్షణాల్లో ఆనందం ఆవిరి.. ఓడినా గెలిచేసిన శ్రీహాన్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook