Samantha Yashoda Movie : సమంత ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ  తెలిసిందే. మయోసైటిస్ అనే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో.. భరించడం ఎంత కష్టమో చదువుతూనే ఉంటాం. కనీసం లేచి నిల్చోవడం, నడవడం కూడా కష్టంగా మారుతుందట. ఎంతో అలసటగా ఉంటుందట. అలా సమంత ఇప్పుడు ఈ వ్యాధి కోసం చికిత్స తీసుకుంటోంది. అయినా కూడా తన యశోద సినిమా కోసం బయటకు వచ్చేందుకు సిద్దపడింది. ఈ క్రమంలోనే నిన్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఆమెలోని మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆమె మొహంలో మార్పులు వచ్చాయి. అవి కనిపిస్తూనే ఉన్నాయి. అయినా కూడా యశోద సినిమా కోసం ఇలా బయటకు వచ్చేస్తోంది. యశోద సినిమా నవంబర్ 11న రాబోతోంది. మరి ఈ చిత్రం సమంతకు ఎలాంటి క్రేజ్‌ను తీసుకొస్తుందో చూడాలి. యశోద ట్రైలర్‌ను చూస్తే మాత్రం ఎంతో ఇంటెన్సిటీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. సరోగసి టాపిక్‌ మీద తీసిన ఈ సినిమాలో యశోద యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా కనిపిస్తోంది.


ఇదిలా ఉంటే.. సమంత మళ్లీ కొటేషన్స్ షేర్ చేయడం ప్రారంభించింది. గతంలో ఇలానే నిత్యం ఏదో ఒక కొటేషన్ షేర్ చేస్తూనే ఉండేది. మా అమ్మ చెప్పింది అంటూ కొన్ని ఎమోషనల్, నీతి సూక్తులను చెబుతూ వచ్చింది. ఇప్పుడు సమంత తన ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబించేలా పోస్ట్ వేసింది. కొండను ఎక్కుతున్నట్టుగా ఓ పిక్‌ను షేర్ చేసింది. కొండకు ఒక వైపు బాగా వర్షం పడుతోన్నట్టుగా చూపింది.


[[{"fid":"251592","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


తుపానులో చిక్కుకున్న నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు అని అక్కడ రాసి ఉంది. ఇక నెక్ట్స్ పోస్ట్‌లో కొండకు అటు వైపు పచ్చని చెట్లు, పూల బాట వేసి ఉంటుంది. అంటే ఒక వైపు కష్టాలున్నా రెండో వైపు సుఖాలుంటాయని చెప్పే ఉద్దేశ్యంలో పోస్ట్ వేసినట్టుగా ఉంది. ఈ క్రమంలో దేవుడు ఏం చేసినా ఓ ప్రణాళిక, ఓ కారణం ఉంటుందని చెప్పుకొచ్చింది. మరి ఈ కొటేషన్ ఎందుకు షేర్ చేసింది? అనేది సమంతకు మాత్రమే తెలియాలి. 


Also Read : Heroine Childhood pic : ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా?.. స్టార్ హీరోకి భార్య.. ఈ కుర్ర హీరోయిన్ ఎవరంటే?


Also Read : Singer MM Manasi : రష్మికను పక్కన నెట్టేసిన సింగర్.. హైలెట్ అయిన మానసి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook