Heroine Childhood pic : ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా?.. స్టార్ హీరోకి భార్య.. ఈ కుర్ర హీరోయిన్ ఎవరంటే?

Heroine Childhood pic : టాలీవుడ్, కోలీవుడ్ భామ ఇప్పుడు తాజాగా ఓ పోస్ట్ వేసింది. తన చిన్న నాటి ఫోటోలను షేర్ చేసింది. చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2022, 04:28 PM IST
  • హీరోయిన్ చిన్ననాటి ఫోటో
  • పాల బుగ్గల హీరోయిన్ ఎవరంటే?
  • స్టార్ హీరో భార్య చిన్ననాటి పిక్స్
Heroine Childhood pic : ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా?.. స్టార్ హీరోకి భార్య.. ఈ కుర్ర హీరోయిన్ ఎవరంటే?

Heroine Childhood pic : హీరోయిన్ల స్పెషల్ పిక్స్ నెట్టింట్లో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. హీరోయిన్ల హాట్ ఫోటోలకు ఎంత గిరాకీ ఉంటుందో.. వారి చిన్న నాటి ఫోటోలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. కీర్తి సురేష్‌ చైల్డ్ హుడ్ పిక్స్, హన్సిక బాల్యానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. రష్మిక మందన తన చిన్నతనంలోని ఫోటోని ఆ మధ్య ఒకటి షేర్ చేసింది. అందులో రష్మిక పోజులు, క్యూట్ నెస్ చూసి అందరూ ఫిదా అయ్యారు.

తాజాగా మరో హీరోయిన్ చిన్నతనం ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సాయేష తాజాగా తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేసింది. అఖిల్ అక్కినేని అఖిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ భామ. ఆ తరువాత కోలీవుడ్‌లొ సినిమాలు చేసింది. అక్కడే హీరో ఆర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కరోనా సమయంలోనే ఈ ఇద్దరి పెళ్లి అయింది. సాయేష తల్లి అయి పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sayyeshaa (@sayyeshaa)

కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇలాంటి హీరోయిన్ తాజాగా తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేసింది. ఆ చిన్నారిని నేనే.. నన్ను ఇలా ఫోటోలు తీసేందుకు మా అమ్మ ఎప్పుడూ రెడీగానే ఉంటుంది.. చిన్నప్పటి ఫోటోలు, వీడియోలు ఎంతో అద్భుతంగా ఉంటాయ్.. మంచి మెమోరీస్..  మనం తల్లిదండ్రులుగా మారినప్పుడే వారి విలువ తెలుస్తుంది అని సాయేష ఎమోషనల్ అయింది.

సాయేష తన ప్రెగ్నెన్సీ వార్తల మీద ఆ మధ్య ఎంతగా ఫైర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక పెళ్లి తరువాత సాయేష షేర్ చేసిన డ్యాన్స్ వీడియోలు, హాట్ ఫోటో షూట్ల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆర్య మీద ఓ మహిళ పెట్టిన కేసు విషయంలో సాయేష పేరు హాట్ టాపిక్‌ అయింది. అలా పెళ్లి తరువాత ఆర్య సాయేష పేర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ కాసాగాయి.
 

Also Read : Singer MM Manasi : రష్మికను పక్కన నెట్టేసిన సింగర్.. హైలెట్ అయిన మానసి

Also Read : Radhika Apte Transparent Dress : డ్రెస్ వేసుకున్నా వేసుకోనట్టే.. రాధిక మాకు తప్పదా? ఇక

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News