Samantha Cries at Shaakuntalam Trailer Launch event సమంత శాకుంతలం ట్రైలర్‌ను సోమవారం నాడు విడుదల చేశారు.అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం సమంత బయటకు వచ్చింది. అసలే సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్నా కూడా శాకుంతలం కోసం బయటకు వచ్చింది. అయితే ఈ ఈవెంట్లో గుణ శేఖర్ మాట్లాడుతూ కంటతడిపెట్టేశాడు. ఈ సినిమా కోసం దిల్ రాజు అందించిన సాయం గురించి చెబుతూ గుణ శేఖర్ ఎమోషనల్ అయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఉంటే.. తమ లాంటి మేకర్లు సినిమాలు తీయగలరని చెబుతూ.. శాకుంతలం సినిమా క్రెడిట్‌ను దిల్ రాజుకు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చాడు గుణ శేఖర్. అయితే గుణ శేఖఱ్ మాట్లాడుతూ ఉండగా.. సమంత కన్నీరు పెట్టేసుకుంది. ఇక సమంత మాట్లాడుతూ.. తాను ఇలా బయటకు రావడానికి కారణం.. గుణ శేఖర్ గారి మీదున్న ప్రేమ, అభిమానం అని చెప్పుకొచ్చింది. తాను శక్తినంతా కూడబెట్టుకుని వచ్చాను.. సమంత తెలిపింది.


 



కొంత మందికి సినిమా అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే.. కానీ గుణ శేఖర్ గారికి మాత్రం లోకం.. ఈ సినిమా ప్రాణం పెట్టి తీశారు.. ఆయనపై మీరిచ్చే ప్రేమను చూడాలని వచ్చాను.. అంటూ సమంత ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది. ఈ కథను ముందు చెప్పినప్పుడు ఎలా తీస్తారు.. ఎలా వస్తుందని అనుకున్నాను.. నేను ఊహించుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది.. సినిమా బాగా వచ్చింది.. అని సమంత తెలిపింది.


శాకుంతలం సినిమాను నమ్మి.. ఏ హద్దులు పెట్టకుండా.. నమ్మకంతో మాకు అండగా నిలబడ్డారు దిల్ రాజు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అందరి గురించి మాట్లాడతాను.. దేవ్ పర్ఫెక్ట్ దుశ్యంత్ అని అనుకున్నాను.. ఫస్ట్ డే అందరూ అమ్మాయిలు ఆయన్నే చూశారు. అప్పుడే ఆయన పర్ఫెక్ట్ అని అనుకున్నా..


కాళిదాసు గారు రాసిన గొప్పకావ్యం శాకుంతలం పాత్రను నాకిచ్చిన గుణ శేఖర్ గారికి థాంక్స్.. నేను జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డా.. ఒకటి మాత్రం మారలేదు.. నేను సినిమాను ఎంతగా ప్రేమిస్తాను.. సినిమా నన్ను ఎంతగా ప్రేమిస్తుందనే నాకు తెలుసు.. శాకుంతలం సినిమాతో ఈ ప్రేమ ఇంకా పెరుగుతుందని నమ్ముతున్నాను.. ఆశిస్తున్నాను.. అని సమంత ఎమోషనల్ అయింది.


Also Read: Keerthy Suresh Bikini : బికినీలో కీర్తి సురేష్‌.. మహానటిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. హీటెక్కించే పిక్స్


Also Read: Shaakuntalam Trailer.. శాకుంతలం ట్రైలర్.. మెస్మరైజ్ చేసిన సమంత.. అల్లు అర్హ ఎంట్రీ అదుర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి