Samantha Valentines day 2023 post సమంత ఇప్పుడు మునుపటి కంటే స్ట్రాంగ్‌గా తిరిగి వచ్చింది. మయోసైటిస్ వచ్చిన సమయంలో కనీసం లేచి నిల్చునే పరిస్థితి కూడా లేదట. కానీ ఇప్పుడు సమంత మళ్లీ తన మునుపటి శక్తిని తిరిగి తెచ్చుకుంది. గతం కంటే మరింత స్ట్రాంగ్‌గా మారిందని అర్థం అవుతోంది. ఆమె వర్కౌట్లు చూస్తేనే ఆ విషయం తెలుస్తోంది. మొన్నటికి మొన్న సమంత గుడి మెట్లు ఎక్కుతూ.. కర్పూరాలు వెలిగిస్తూ తన మొక్కును తీర్చుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇదంతా చూస్తుంటే సమంత ఎంత స్ట్రాంగ్‌గా తిరిగి వచ్చిందో అర్థం అవుతోంది. ఇక సమంత ఇప్పుడు వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఓ పోస్ట్ వేసింది. బాక్సింగ్‌ చేస్తూ సీరియస్‌గా ఉన్న లుక్‌ను షేర్ చేస్తూ హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పింది. అంటే తాను మరింత స్ట్రాంగ్‌గా వచ్చానంటూ.. ఎవడైనా కౌంటర్లు, సెటైర్లు, ట్రోలింగ్ చేస్తే పగిలిపోద్ది అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తోంది.


సమంత అసలే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అయిన వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్‌తో బిజీగా ఉంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తోంది. ఇది కాకుండా విజయ్ దేవరకొండ ఖుషి సినిమా కూడా లైన్లో ఉంది. ఇది ఈ నెలలోనే మళ్లీ సెట్స్ మీదకు రానుంది. శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.


ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. పలు మార్లు వాయిదా పడుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏప్రిల్‌ 14న ఈ చిత్రం రాబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. మరి ఆ తేదీన అయినా వస్తుందా? లేదా? అన్నది చూడాలి. నాగ చైతన్యతో విడాకులు జరగడం, ఆ తరువాత ఆమె మీద రకరకాల రూమర్లు రావడం, భరణం, పిల్లల్ని కనడం ఇష్టలేకపోవడం వల్లే ఇంత వరకు వచ్చిందటూ ఇలాంటి రూమర్లు రావడంపై సమంత సీరియస్ అయిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య మీద ప్రతీ సారి తన అయిష్టాన్ని, ద్వేషాన్ని చూపిస్తున్నట్టుగానే సమంత రియాక్ట్ అవుతూ వచ్చింది.


Also Read:  Sreeja Konidela : ప్రేమ మీద పోస్టులు.. కళ్యాణ్‌ దేవ్ అలా.. శ్రీజ కొణిదెల ఇలా


Also Read: Nabha Natesh Photoshoot : ఇస్మార్ట్ పొరీ చేస్తొంది కాయ్ కచోరి.. నభా నటేష్‌ అందాల ప్రదర్శన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook