Sreeja Konidela : ప్రేమ మీద పోస్టులు.. కళ్యాణ్‌ దేవ్ అలా.. శ్రీజ కొణిదెల ఇలా

Sreeja Konidela valentine's day శ్రీజ కొణిదెల తన ఫ్రెండ్స్, తన కూతురితో కలిసి వాలెంటైన్స్ డేను సెలెబ్రేట్ చేసుకుంది. గాలెంటైన్స్ డే అంటూ కొత్తగా నామకరణం చేసింది. అయితే ఆ తరువాత ప్రేమ గురించి చెబుతూ ఓ పోస్ట్ వేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2023, 10:08 AM IST
  • వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టులు
  • మొదట పోస్ట్ వేసిన కళ్యాణ్‌ దేవ్
  • తన కూతురితో శ్రీజ సెలెబ్రేషన్స్
Sreeja Konidela : ప్రేమ మీద పోస్టులు.. కళ్యాణ్‌ దేవ్ అలా.. శ్రీజ కొణిదెల ఇలా

Sreeja Konidela valentine's day post శ్రీజ కొణిదెల, కళ్యాణ్ దేవ్‌ల మధ్య ఇప్పుడు ఎలాంటి బంధం ఉందో అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఉండక రెండేళ్లకు పైనే అవుతోంది. కరోనా సమయంలోనే ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు కనిపస్తోంది. ఫస్ట్ వేవ్ సమయంలో కళ్యాణ్‌ దేవ్ కరోనా బారిన పడ్డాడు. ఆ టైంలో శ్రీజ, కళ్యాణ్‌ దేవ్‌లు బాగానే ఉన్నారు. కానీ ఆ తరువాతే ఈ ఇద్దరి మధ్యే గ్యాప్ వచ్చింది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలెబ్రేషన్స్‌లో కళ్యాణ్ దేవ్ కనిపించకుండా ఉండటంతో విడాకుల రూమర్లు వచ్చేశాయి.

శ్రీజ అయితే తన ఇన్ స్టాగ్రాంలో పేరుని మార్చుకోవడం, కళ్యాణ్‌ అనే పేరుని తీసేసి కొణిదెల అంటూ రాసుకోవడంతో ఈ విడాకుల రూమర్లు మరింత ఎక్కువగా అయ్యాయి. ఇప్పటి వరకు ఈ ఇద్దరూ తమ బంధం మీద క్లారిటీ ఇవ్వలేదు. విడాకుల రూమర్లు ఇంతగా వస్తున్నా కూడా వాటిని ఖండించడమో, ధృవీకరించడమో చేయడం లేదు. అయితే కళ్యాణ్‌ దేవ్ మాత్రం అప్పుడప్పుడు తన కూతురిని మిస్ అవుతున్నానంటూ పోస్టులు పెడుతుంటాడు. 

అలా కళ్యాణ్‌ దేవ్ పెట్టే పోస్టులతోనే విడాకులు కన్ఫామ్ అయిపోయాయని, ఇద్దరూ విడిపోయారని, దూరంగా ఉంటున్నారనే విషయం అందరికీ అర్థం అవుతుంటుంది. మొన్నటి కళ్యాణ్‌ దేవ్ బర్త్ డే నాడు నవిష్క కనిపించింది. తండ్రీకూతుళ్లిద్దరూ కలిసి ఎంతో సంతోషంగా కనిపించారు. తన కూతురిని చూసుకుని కళ్యాణ్‌ దేవ్ మురిసిపోయాడు.

కళ్యాణ్‌ దేవ్ నిన్న ఓ పోస్ట్ వేశాడు. మనం ఎంతగా ప్రేమిస్తున్నామని కాదు.. వాళ్లు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు. అది అలా ఉంటే.. శ్రీజ కొణిదెల ప్రేమ గురించి ఇంకో పోస్ట్ వేసింది. ప్రేమ అంటే ఏంటో చెప్పేసింది. ప్రేమంటే.. నీతో ప్రేమలో పడేసుకోవడం కాదు.. తనతో తనే ప్రేమలో పడేలా చేయడం.. ఉన్న ప్రేమను గుర్తించాలి.. ప్రేమ కోసం ఎక్కడో వెతకకూడదు అంటూ శ్రీజ షేర్ చేసింది.

వీటిని చూస్తుంటే కళ్యాణ్‌ దేవ్‌కు కౌంటర్‌గానే శ్రీజ కూడా ప్రేమ కొటేషన్‌ను షేర్ చేసినట్టుగా ఉంది. అసలు ఈ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది.. విడాకుల వరకు వ్యవహారం ఎందుకు వెళ్లింది అనే విషయం మీద ఇంత వరకు క్లారిటీ రావడం లేదు.

Also Read:  manchu Lakshmi at Varanasi : వాలెంటైన్స్ డే.. వారణాసిలో మంచు లక్ష్మీ.. ట్వీట్ వైరల్

Also Read: Supritha Photos : వామ్మో అనిపించేలా సుప్రిత అందాలు.. తల్లితో కలిసి బీచ్‌లో అలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News