Samantha Ruthprabhu Reveals ORMAX Media Secret: అదేమి విచిత్రమో కానీ సాధారణంగా విడాకుల తరువాత హీరోయిన్లకు క్రేజ్ తగ్గుతుందని భావిస్తారు. కానీ సమంత విషయంలో మాత్రం అది తప్పని ప్రూవ్ అయింది. నాగచైతన్యతో విడాకుల తీసుకున్న తర్వాత ఆమె కెరీర్ లో మళ్ళీ భారీ గ్రోత్ కనిపిస్తోంది. విడాకులు తీసుకోవడానికి ముందు ఆమె చేసిన ఫ్యామిలీ మెన్ సిరీస్ సూపర్ హిట్ కాగా విడాకులు తీసుకున్న తరువాత కొన్నాళ్లకు చేసిన పుష్ప సాంగ్ కూడా ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ దెబ్బతో ఆమె బాలీవుడ్ లో సెటిల్ అయిపోవడం ఖాయం అంటున్నారు. అందుకే ఎక్కువగా ఆమె హిందీ దర్శక నిర్మాతలకు టచ్ లో ఉంటున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దానికి కారణం ఆమె ఇటీవల కాఫీ విత్ కరణ్ అనే ఒక షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించే ఈ షోలో ఆమె అక్షయ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. అయితే ఈ షోలో పాల్గొన్న సమయంలో ఆమెకు ఇటీవల ఆర్మాక్స్ పాన్ ఇండియా హీరోయిన్స్ లిస్టులో మొదటి స్థానం రావడాన్ని గురించి కరణ్ జోహార్ ప్రస్తావించారు.


మీరు ఎలా మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు అని అడిగితే నేను అందులో పని చేసే వారికి గట్టిగా డబ్బులు ఇచ్చాను అంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిజానికి ఆమె ఆ మాటలు సరదాగానే పేర్కొంది కానీ అది నిజమే అనుకుని చాలామంది సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి సమంత సౌత్ హీరోయిన్స్ లిస్టులో ఎప్పుడూ టాప్ ప్లేస్ సాధిస్తూ ఉండేది. మరీ ముఖ్యంగా తెలుగు హీరోయిన్స్ లిస్టులో మాత్రం ఎప్పుడూ ఆమె మొదటి స్థానంలో నిలబడుతూ వస్తోంది.


అలాంటిది ఈసారి ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్స్ లిస్టులో మొదటి స్థానాన్ని సంపాదించడంతో కరణ్ జోహార్ ఈ ప్రశ్న అడిగారు. దానికి సమంత భిన్నంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి సమంత బాలీవుడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తునట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కరణ్ జోహార్ ద్వారానే ఆమె బాలీవుడ్ లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. దీనికి సంబంధించి మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Also Read: Sravana Bhargavi: ఎట్టకేలకు వెనక్కు తగ్గిన శ్రావణ భార్గవి.. డిలీట్ చేయనంటూనే డిలీట్!


Also Read: Producer Councell: షూటింగుల నిలిపివేత విషయంలో కీలక ప్రకటన!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook