Kushi Movie Getups: ఖుషీలో అప్పుడు ముస్లింగా దేవరకొండ.. ఇప్పుడు సమంత.. ఇదేందయ్య ఇదీ!

Samantha Ruthprabthu in Muslim Getup: మే తొమ్మిదో తేదీన విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా నా రోజా నువ్వే అనే పాట రిలీజ్ చేయబోతున్న క్రమంలో తాజాగా ప్రోమో రిలీజ్ చేయగా అది చర్చనీయాంశం అవుతోంది.
Samantha Ruthprabthu and Vijay Devarakonda in Muslim Getups: విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా ఖుషి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తెరకెక్కిస్తారని పేరున్న శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నిర్మాత నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రేక్షకుల్లో చాలా బజ్ ఏర్పడింది, దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కి కూడా ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడింది. ఇక సినిమాని రిలీజ్ కి సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఖుషి మొదటి పాటను విడుదల చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు.
Also Read: Sreemukhi Photos: నైటు గౌనులో శ్రీముఖి కవ్వింత..ఇన్నర్స్ కనిపించేలా పరువాల విందు!
మే తొమ్మిదో తేదీన విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా నా రోజా నువ్వే అనే పాట రిలీజ్ చేయబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలోనూ ఆ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయడంతో ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మలయాళ హృదయం సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా మంచి క్రేజ్ దక్కించుకున్న అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి బ్యూటిఫుల్ ట్రాక్స్ అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఉన్న మ్యూజిక్ అయితే వినసొంపుగా ఉంది. దీంతో మొదటి సింగిల్ మీద అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే ఇక్కడ తాజాగా ఒక విషయాన్ని సోషల్ మీడియాలో మీంపేజెస్ గుర్తించాయి అదేమిటంటే మొదటి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సమయంలో విజయ్ దేవరకొండ ముస్లిం కుర్రాడి గెటప్ లో కనిపించాడు.
అప్పుడు సమంత సాంప్రదాయ బద్దంగా చీర కట్టుకుని కనిపించింది. ఇప్పుడు పాట ప్రోమోలో మాత్రం సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరూ మోకాళ్ళ మీద కూర్చుని నమాజ్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉండగా సమంత అయితే తలకి హిజాబ్ చుట్టుకుని కనిపించింది. దీంతో ఇదెక్కడి ట్విస్ట్ లు మామా అంటూ మీమ్ పేజెస్ వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Anasuya Bharadwaj: దేవరకొండ ఫాన్స్ ని గిల్లి.. జిమ్లో భర్తతో వర్కౌట్స్ మొదలెట్టిన అనసూయ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook