Samantha vs Lawrence: పని చేయని సమంత మ్యాజిక్.. ఆ ఏరియాల్లో రచ్చ రేపిన లారెన్స్!
Shaakuntalam Day 1 vs Rudrudu Day 1 Collections: శుక్రవారం నాడు రెండు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా ఆ రెండు సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం.
Shaakuntalam Collections vs Rudrudu Collections: శుక్రవారం నాడు రెండు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ డైరెక్షన్లో రూపొందిన శాకుంతలం సినిమా శుక్రవారం నాడే థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాని దిల్ రాజు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయగా గుణశేఖర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ మోహన్ హీరోగా నటించగా అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ భారతుడి పాత్రలో నటించడంతో సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ సినిమాకు ఏమాత్రం సంబంధం లేని మరో సినిమా కూడా రిలీజ్ అయింది. రాఘవ లారెన్స్ హీరోగా కదిరేసన్ దర్శకనిర్మాతగా తమిళంలో రుద్రన్ అనే సినిమాని తెలుగులో రుద్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ రుద్రుడు సినిమా సమంత శకుంతల సినిమాతో పోటీ పడింది. ఇక వాస్తవానికి సమంత శాకుంతలము సినిమా పూర్తిస్థాయి క్లాసికల్ టచ్ ఉన్న మైధలాజికల్ సబ్జెక్ట్ అయితే రాఘవ లారెన్స్ హీరోగా నటించిన రుద్రుడు సినిమా మాత్రం మదర్ సెంటిమెంట్ తో కూడిన పూర్తిస్థాయి మాస్ మసాలా మూవీ.
ఇదీ చదవండి: Samantha Divorce: నాగచైతన్య మంచి కోరే సమంత విడాకులు ఇచ్చిందా.. వెలుగులోకి షాకింగ్ అంశం!
ఈ క్రమంలో సమంత సినిమా నైజాం ప్రాంతంలో 52 లక్షలు, సీడెడ్ 10 లక్షలు, ఉత్తరాంధ్ర 15 లక్షలు, ఈస్ట్ గోదావరి 8 లక్షలు, వెస్ట్ గోదావరి 4 లక్షలు, గుంటూరు 8 లక్షలు, కృష్ణ 8 లక్షలు, నెల్లూరు 3 లక్షలు మొత్తం కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి ఎనిమిది లక్షల షేర్, రెండు కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది. తమిళ్ లో 22 లక్షలు, కర్ణాటక సహా మిగతా భారతదేశంలో 20 లక్షలు, ఓవర్సీస్ లో 74 లక్షలు కలిపి మొత్తం రెండు కోట్ల 24 లక్షల షేర్ నాలుగు కోట్ల 70 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది.
మరో పక్క రాఘవ లారెన్స్ హీరోగా నటించిన రుద్రుడు సినిమా కూడా దాదాపు 28 లక్షల తేడాతో తెలుగు రాష్ట్రాల వసూళ్లు రాబట్టింది. నైజాం ప్రాంతంలో రుద్రుడు 26 లక్షలు వసూలు చేయగా సీడెడ్ ప్రాంతంలో 15 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 10 లక్షలు, ఈస్ట్ గోదావరి 8 లక్షలు, వెస్ట్ గోదావరి నాలుగు లక్షలు, గుంటూరు ఏడు లక్షలు, కృష్ణ 7 లక్షలు, నెల్లూరు 3 లక్షలు కలిపి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల షేర్ కోటి 5 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 6 కోట్ల 80 లక్షలు కావడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ఏడున్నర కోట్లు నిర్ణయించారు.
ఇంకా ఆరు కోట్ల 70 లక్షలు వసూలు చేస్తే సినిమా హిట్ అవుతుందని అంటున్నారు. సమంత సినిమాతో పోలిస్తే ఈ సినిమా బిజినెస్ కూడా చాలా తక్కువగానే జరిగిమా మొదటి రోజు వసూళ్లు మాత్రం సమంతతో సమానంగా దాదాపుగా 28 లక్షల తేడాతోనే అందుకోవడం గమనార్హం. సమంత శకుంతలం సినిమా క్లాస్ సినిమా కావడంతో మాస్ సెంటర్లో అభిమానులు ఆ సినిమా చూసేందుకు ఆసక్తి చూపించలేదు. వారంతా ఎక్కువగా రుద్రుడు సినిమా చూసేందుకు ఆసక్తి చూపించడంతో వసూళ్లలో రుద్రుడు సినిమా కూడా సమంత సినిమా దగ్గరకు వచ్చినట్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Shaakuntalam vs Rudrudu: సమంతకి షాక్.. ఆ ఏరియాలలో లారెన్స్ మైండ్ చెదిరే డామినేషన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook