Shaakuntalam Weekend Collections సమంత శాకుంతలం సినిమా మీద ముందు నుంచి కూడా ఎటువంటి పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వలేదు. కనీసం మ్యూజిక్ పరంగానూ ఒక్క పాట కూడా క్లిక్ అవ్వలేదు. విజువల్స్ మరీ నాసిరకంగా ఉండటం.. వీఎఫ్‌ఎక్స్ తేలిపోవడం, గుణ శేఖర్ రాసుకున్న కథ, కథనం మరింత నీరసంగా సాగడం, సమంతలో మునుపటి గ్లో మిస్ అయిందని నెటిజన్లు అనడం     అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా మీద దారుణమైన ట్రోలింగ్ కూడా జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాను పైరసీ చేయకండని, చేస్తే మాకు కంప్లైంట్ చేయండని టీం నుంచి ఓ ప్రెస్ నోట్ రావడం మీద కూడా దారుణమైన ట్రోలింగ్ జరిగింది. ఈ సినిమాను ఫ్రీగా చూపించినా చూడమని, ఎవ్వరూ ఫైరసీ చేయరని, నువ్ చేయమన్నా కూడా చేయమంటూ మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలా శాకుంతలం సినిమా మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


సమంత శాకుంతలం సినిమాకు మొత్తం మూడు రోజుల్లో ఏడు కోట్లకు పైగా గ్రాస్.. మూడున్నర కోట్లకు పైగా షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఎంతో కీలకమైన ఆదివారం నాడు ఈ సినిమాకు దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. కనీసం కోటి రూపాయల షేర్ కూడా సమంత రాబట్టలేకపోయింది. విపరీతమైన నెగెటివ్ టాక్ ఈ సినిమాను నిండా ముంచినట్టు కనిపిస్తోంది.


Also Read:  Prabhas Salaar : రెండు పార్టులుగా సలార్!.. సీక్రెట్ రివీల్ చేసిన విలన్ దేవరాజ్


అసలు ఈ సినిమా బడ్జెట్ విషయంలో ముందు నుంచి ఓ కన్ఫ్యూజన్ ఉంది. కొందరేమో అరవై కోట్లు అంటారు.. ఇంకొందరేమో ఎనభై కోట్లు అంటారు.. మరి కొందరు యాభై కోట్లు అంటున్నారు.. అయితే కనీసం పదిశాతం కూడా అందులో రికవరీ చేసేట్టు కనిపించడం లేదు. చూస్తుంటే ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా శాకుంతలం నిలిచేట్టు కనిపిస్తోంది.


ఇలాంటి సినిమా మీద దిల్ రాజు ఎలా నమ్మకం పెట్టుకున్నాడు? డబ్బులెందుకు పెట్టి ఉంటాడు.. దీని కంటే బలగం సినిమాను ఎంతో గ్రాండ్‌గా తీసినట్టు అనిపిస్తుంది కదా? అని జనాలు అంటున్నారు. అయితే ఈ సినిమా దిల్ రాజు డబ్బులేమీ పెట్టలేదని, తన బ్రాండ్‌ను మాత్రమే ఇచ్చాడని చెబుతున్నారు. ఈ సినిమాతో గుణ శేఖర్ మాత్రమే నిండా మునిగాడని అంటున్నారు.


Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook