O Antava Song Rehearsal: వీడు నన్ను చంపేశాడు- సమంత సంచలన వ్యాఖ్యలు
O Antava Song Rehearsal: అల్లు అర్జున్ నటించిన `పుష్ప`లోని `ఊ అంటావా మామా..` పాట ఎంతో పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సాంగ్ లోని సమంత స్టెప్పులు, హావభావాలకు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. అయితే ఈ పాట కోసం సామ్ చాలా కష్టపడిందట. ఆ పాటకు సంబంధించిన కొన్ని రిహాసల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.
O Antava Song Rehearsal: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' బాక్సాఫీస్ వద్ద రికార్డులను షేక్ చేస్తోంది. బన్నీ నటనకు తోడు డైలాగ్స్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి అభిమానులు ఊగిపోతున్నారు.
మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సమంత చేసిన ప్రత్యేక గీతం (ఊ అంటావా మామా..) హైలైట్‌గా నిలుస్తోంది. పాటతో పాటు బన్నీతో సమంత చేసిన స్టెప్పులు.. థియేటర్లలో అభిమానులతో ఈలలు వేయిస్తోంది.
అయితే ఈ పాట కోసం చాలా కష్టపడిందట సామ్. అందులో వేసే స్టెప్పుల కోసం చాలా కష్టపడ్డానని చెబుతోంది. 'ఊ అంటావా మామా..' పాట కోసం సామ్ చేసిన ప్రాక్టీస్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. డ్యాన్స్ ప్రాక్టీస్ తో కొరియాగ్రాఫర్ సహాయకుడు తనను ఏడింపిచిటన్లు సరదాగా వ్యాఖ్యనించింది సమంత.
ఎర్రచందనం స్మగ్లింగ్ కధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇది తొలి భాగం మాత్రమే. 'పుష్ప ది రూల్' పేరుతో రెండవ భాగం వచ్చే ఏడాది విడుదల కానుంది. అద్భుతమైన యాక్షన్ సీన్లతో తెరకెక్కిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటోంది.
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ ప్రతినాయకుడి పాత్రలు పోషించారు. యాంకర్ అనసూయ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర నటించారు. స్టార్ హీరోయిన్ సమంత ఓ ఐటం సాంగ్ చేశారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. నవీన్ యెరనేని. వై. రవి శంకర్ నిర్మాతలుగా ఉన్నారు.
Also Read: Anasuya Bharadwaj Photos: బుల్లిగౌనులో మెరిసిపోతున్న రంగమ్మత్త- వైరల్ పిక్స్ మీరూ చూసేయండి!
Also Read: Eesha Rebba Latest Photos: ఈషా రెబ్బా అట తన పేరు.. అందానికి సొంతూరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి