Samantha Siddhu Jonnalagadda Movie: విడాకుల తర్వాత సమంత చేస్తున్న ప్రాజెక్టులు ఏవీ పెద్దగా ఆమెకు కలిసి రావడం లేదు. ప్రస్తుతానికి సమంత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మరోపక్క హిందీ లో బాలీవుడ్ హీరో వరుణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సైటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఆ తర్వాత ఆమె ఎవరితో సినిమా చేయబోతున్నారు అని ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు ఆసక్తికరమైన కాంబినేషన్ ఒకటి తెరమీదకు వచ్చింది. అదేమిటంటే సిద్దు జొన్నలగడ్డ హీరోగా సమంత హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉందని అంటున్నారు. సమంత స్నేహితురాలు దర్శకురాలు నందిని రెడ్డి ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో నిర్మాతగా పలు సినిమాలు నిర్మించిన రామ్ తాళ్లూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.


Also Read: Keerthy Suresh: దుబాయ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి కీర్తి బర్త్ డే విషెస్..కొత్త చర్చ షురూ!


మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత జబర్దస్త్ అనే సినిమాలో నటించింది సిద్ధార్థ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా హిట్ అవలేదు కానీ ఆ సినిమాతో నందినీరెడ్డి సమంత మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. అలా వారిద్దరూ కలిసి చేసిన ఓ బేబీ కూడా ఈ మధ్యనే సూపర్ హిట్ అయింది. ప్రస్తుతానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించిన అన్ని మంచి శకునములే సినిమా గురువారం నాడు థియేటర్లలోకి రాబోతోంది.


సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నందిని రెడ్డి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. తన తదుపరి సినిమాలో హీరోగా సిద్దు ఫిక్స్ అయ్యాడు కానీ హీరోయిన్ ఎవరు అనేది అనుకోలేదని సమంత విషయంలో కూడా ఏమీ నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. అయితే సమంత నాగచైతన్య కాంబినేషన్లో కూడా నందిని రెడ్డి ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినట్లు కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. కానీ బహుశా ఇప్పుడు నాగచైతన్య ప్లేసులోకి సిద్ధూ జొన్నలగడ్డ వచ్చి ఉండవచ్చని ప్రచారం కూడా జరిగింది.  అయితే ఈ విషయం మీద మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు.


Also Read: Puri Jagannadh: 'పూరీ జగన్నాధ్'ను డబ్బు వెనక్కడిగే హక్కుందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి