Samantha Post Viral: సినిమా ఇండస్ట్రీలో ట్రోల్స్ భారినపడని వారు లేరు.. చిన్న హీరోలు అనే కాదు పెద్ద హీరోలు కూడా వీటిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే.. వారు ఏం చేసిన ట్రోల్స్ భారిన పడటం సర్వ సాధారణం.. కొంత మంది నటీమణులు ట్రోల్స్ ని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతుంటారు. కానీ కొంత మంది హీరోయిన్లు ట్రోల్స్ కు తగిన సమాధానం చెప్తూ ముందుకు వెళ్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇపుడు ఈ విషయం దేనికి అనే కదా మీ సందేహం.. సమంత ట్రోలర్స్ కి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇపుడు వైరల్ అవుతుంది.. విడాకుల తరువాత సమంత ఏం చేసిన వైరల్ అవుతుంది. ఇప్పటికే సమంత తన వ్యక్తిగత జీవితాన్ని వక్రీకరించొద్దు అని చాలా సార్లు అభ్యర్థించినప్పటికీ, ట్రోలర్స్ మాత్రం ఏదొక విషయంలో సమంతని లాగుతూనే ఉన్నారు. 


సమంత పోస్ట్ చేసిన ఒక ఫోటోను ట్రోలర్స్ విపరీతంగా ట్రోల్ చేయటంతో సమంత వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇటీవల ఒక అవార్డు ఫంక్షన్ లో సమంత వేసుకున్న డ్రెస్ పై ట్రోలర్స్ తెగ విరుచుకు పడిన సంగతి తెలిసిందే. సమంత ఫోటోను చూసిన ట్రోలర్స్.. ఇలా బోల్డ్ గా ఉండటం వల్లే అక్కినేని ఫ్యామిలీ వదిలేసిందని, విడాకుల తరువాత సమంత మరీ తెగించిందని ట్రోలర్స్ కామెంట్స్ చేశారు. 


[[{"fid":"224470","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ట్రోల్స్ కు స్పందించిన సమంత" "మనం 2022 లో ఉన్నాం.. మహిళల రంగు, దుస్తువులు, చదువు, అందం, సామాజిక స్థితుల గురించి కామెంట్ చేయటం చాలా సులభం కానీ అది ఎంత వరకు కరెక్టో మీరే ఆలోచించుకోండి. మహిళలు ధరించే నెక్‌లైన్‌, హెమ్‌లైన్‌ దుస్తులను జడ్జ్ చేయటం మానేయండి. మహిళల దుస్తువులు, రంగు బట్టి వారిని జడ్జ్ చేయటం మానేసి.. సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి, మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు చాలానే ఉన్నాయి వాటి పైన మీ దృష్టి సారిస్తే చాలా మంచిది. మీ వ్యక్తిగత అభిప్రాయాలను ఇతరులపై రుద్దటం మానేసి.. మంచి కోసం ఆలోచించండి. మీ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించటం వలన ఎలాంటి లాభం ఉండదు.. వ్యక్తిని అర్థం చేసుకోటానికి ప్రయతించండి" అంటూ పోస్ట్ చేసింది". సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


Also Read: AP Cabinet Extension: ఏపీ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి మళ్లీ ఛాన్స్, కన్నబాబుకు ప్రమోషన్


Also Read: RRR Celebration Anthem: 'ఆర్ఆర్​ఆర్' అప్ డేట్.. 'ఎత్తర జెండా' సాంగ్ ప్రోమో రిలీజ్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook