RRR Celebration Anthem: 'ఆర్ఆర్​ఆర్' అప్ డేట్.. 'ఎత్తర జెండా' సాంగ్ ప్రోమో రిలీజ్..

RRR Song Promo: 'ఆర్ఆర్​ఆర్' నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రం నుంచి 'ఎత్తర జెండా' సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో ఎన్టీఆర్, చరణ్, ఆలియా సందడి మామూలుగా లేదు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2022, 10:52 PM IST
RRR Celebration Anthem: 'ఆర్ఆర్​ఆర్' అప్ డేట్.. 'ఎత్తర జెండా' సాంగ్ ప్రోమో రిలీజ్..

RRR's Etthara Jenda Song Promo Release: రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించిన సినిమా 'ఆర్ఆర్ఆర్' (RRR Movie). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది.  ఆలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటించారు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి (Keeravaani) సంగీతమందించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. 'ఎత్తర జెండా' సాంగ్ కు సంబంధించిన ప్రోమో (Etthara Jenda Song Promo) రిలీజ్ చేశారు. 'నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా..' అంటూ పాట సాగుతోంది. ఇందులో ఎన్టీఆర్-చరణ్ డ్యాన్స్ లు, ఆలియా ఎక్స్ ప్రెషన్స్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. 19 సెకన్ల నిడివి ఉన్న ఈ సాంగ్ ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పూర్తి పాటను మార్చి 14న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ సెన్షెసన్ క్రియేట్ చేశాయి. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Also Read: RRR Movie: కెనడాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా​.. కార్లతో RRR స్పెషల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News