Samantha in The family man 2 web series: సమంత తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మేన్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో విడుదలైంది. రాజ్, డికె డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్‌లో సమంత ఓ టెర్రరిస్ట్ పాత్రలో కనిపించనుందని తెలిసినప్పటి నుంచి ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌పై తెలుగు, తమిళ ఆడియెన్స్‌లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌ని అమెజాన్ ప్రైమ్ గురువారం తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఓప్‌లోడ్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌లో ఫస్ట్ ఎపిసోడ్ ఎగ్జైల్ (Exile) ఉత్తర శ్రీలంకలో తమిళ ఈళం, శ్రీలంక ఆర్మీ బలగాల మధ్య యుద్ధ సన్నివేశంతో వెబ్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెపన్ (Weapon) పేరుతో అప్‌లోడ్ అయిన  2వ ఎపిసోడ్‌లో సమంత ఎంట్రీ సీన్ ఉంది. రాజీ అనే యువతి పాత్రలో ఓ టెక్స్‌టైల్ కంపెనీలో పనిచేస్తున్న సమంతను ఆమె పనిచేసే చోట మేనేజర్ ఆమెను లైంగికంగా వేధించడం వంటి దృశ్యాలతో సమంత ఎంట్రీని చూపించారు. 


Also read: Mahesh Babu: మరోసారి pokiri గెటప్‌లో మహేష్ బాబు


ఇదిలావుంటే, ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌లో సమంత పాత్ర తీరు తెన్నులపై తమిళనాట వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సమంతను తమిళ తంబీలు సోషల్ మీడియాలో షేమ్ ఆన్ యు సమంత అంటూ ట్రోల్ (Trolls on Samantha) చేశారు కూడా. ఈ నేపథ్యంలో విడుదలైన ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌ని తమిళ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచిచూడాలి మరి.


Also read : Shivani Rajashekar: కన్నులు చెదిరే అందాన్నే లిరికల్ సాంగ్ Youtubeలో ట్రెండింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook