Mahesh Babu: మరోసారి pokiri గెటప్‌లో మహేష్ బాబు

Mahesh Babu as police officer: మహేష్ బాబు మరోసారి పోకిరి మూవీ తరహాలో అండర్ కవర్ ఆపరేషన్‌లో పాల్గొనే పోలీస్ ఆఫసీర్ పాత్రలో కనిపించనున్నాడా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఎవ్వరూ ఇవ్వనప్పటికీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాక్ మాత్రం ఇదే. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట షూట్ (Sarkaru vaari paata) పూర్తి చేయాల్సి ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 4, 2021, 06:59 AM IST
Mahesh Babu: మరోసారి pokiri గెటప్‌లో మహేష్ బాబు

Mahesh Babu as police officer: మహేష్ బాబు మరోసారి పోకిరి మూవీ తరహాలో అండర్ కవర్ ఆపరేషన్‌లో పాల్గొనే పోలీస్ ఆఫసీర్ పాత్రలో కనిపించనున్నాడా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఎవ్వరూ ఇవ్వనప్పటికీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాక్ మాత్రం ఇదే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో సెట్స్‌పైకి వెళ్లనున్న #SSMB28 మూవీ మహేష్ బాబు అభిమానులను ఎంతో ఉత్కంఠకు గురిచేస్తోంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన అతడు, ఖలేజా చిత్రాలు ఇప్పటికీ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంటాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

ఈ నేపథ్యంలోనే పదేళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా అనగానే మహేష్ బాబు అభిమానుల్లో ఎక్కడాలేని ఉత్సాహం కనిపించింది. అందుకు తగినట్టుగానే ఈ సినిమాపై రకరకలా కథనాలు మహేష్ బాబు అభిమానులను సోషల్ మీడియాలో బిజీ అయ్యేలా చేస్తున్నాయి. అందులో తాజాగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. మహేష్ బాబును త్రివిక్రమ్ ఈ సినిమాలో (#SSMB28) అండర్ కవర్ కాప్‌గా చూపించబోతున్నాడని. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై త్రివిక్రమ్ టీమ్ కానీ లేదా హారిక హాసిని క్రియేషన్స్ టీమ్ కాని స్పందించలేదు. 

Also read : Tollywood: మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు
మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట షూట్ (Sarkaru vaari paata) పూర్తి చేయాల్సి ఉంది. కరోనావైరస్ కారణంగా ఆ షూట్ నిలిచిపోయింది. ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమా ఓ ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్ నటి శిల్పా శెట్టిని ఎంపిక చేసుకుంటున్నట్టు టాక్ వినిపించింది. అన్నట్టు మహేష్ బాబు ఇటీవలే తన తండ్రి అలనాటి సూపర్ స్టార్ క్రిష్ణ బర్త్ డే సందర్భంగా బుర్రిపాలెం గ్రామస్తులకు ఉచితంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. (Mahesh Babu arranges free COVID-19 vaccination drive). 

Also read : SVP first look: Mahesh Babu ఫ్యాన్స్‌కి తప్పని డిజ్పపాయిట్‌మెంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News