Samantha Statue : సమంతకు గుడి కట్టిన ఫ్యాన్.. అసలు అక్కడ ఉన్నది ఎవరు?.. ఫన్నీ ట్రోల్స్, మీమ్స్
Temple to Samantha సమంత అభిమాని ఒకరు ఆమెకు గుడి కట్టించిన సంగతి తెలిసిందే. సమంత బర్త్ డే సందర్భంగా నిన్న ఈ గుడిని ప్రారంభించాడు. గుడి ఓకే కానీ.. అందులో సమంత ఎక్కడుంది? అంటూ ట్రోల్స్, మీమ్స్‌తో నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.
Samantha Statue Memes అభిమానం ఒక్కోసారి పిచ్చి, వెర్రితనానికి దారి తీస్తుంటుంది. ఇక హీరో హీరోయిన్లకు గుళ్లు కట్టించడం అనేది ఇప్పుడు కామన్ అయింది. తమిళంలో ఇలాంటి గుళ్లు కట్టే సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. కుష్బూ, హన్సిక, రజినీ, నిధి అగర్వాల్ వంటి వారికి అక్కడ గుళ్లు కట్టేశారు. ఇప్పుడు ఈ పద్దతి తెలుగులోకి కూడా వచ్చినట్టు అనిపిస్తోంది. ఓ అభిమాని సమంతకు గుడి కట్టించాడు. శుక్రవారం నాడు సమంత బర్త్ డే సందర్భంగా ఈ గుడిని ప్రారంభించాడు.
సమంత గుడి, ఆ గుడిలోని సమంత విగ్రహం మీద ఇప్పుడు ట్రోల్స్ జరుగుతున్నాయి. అసలు సమంతలా లేదని, ఆ విగ్రహం ఎవరిదని నెటిజన్లు కౌంటర్లతో హల్చల్ చేస్తున్నారు. ఇక ఫన్నీ మీమ్స్ అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. గుడి ఓకే కానీ.. సమంత ఎక్కడుంది.. నువ్ సమంత అని చెప్పే వరకు నాకు తెలియలేదు బ్రో అంటూ ఇలా నానా రకాలుగా కౌంటర్లు వేస్తున్నారు.
ఏయ్ నవ్వొద్దు సీరియస్ అంటూ బాలయ్య మీమ్స్‌ను వాడేస్తున్నారు. ఇక బ్రహ్మానందం స్టిల్స్‌ను వాడుకుంటూ ఈ విగ్రహం మీద నానా రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. నిన్న సమంత బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ నుంచి విషెస్ అందాయి. అయితే టాప్ హీరోలు ఎవ్వరూ కూడా సమంతకు సోషల్ మీడియాలో విషెస్ అందించలేదు. ఒక్క రామ్ చరణ్ మాత్రమే విషెస్ చెప్పాడు. సాయి ధరమ్ తేజ్, రామ్ వంటి హీరోలు సైతం విషెస్ చెప్పారు.
Also Read: Kriti Sanon Sita Posters : అశోకవనంలో సీత.. ఆదిపురుష్ నుంచి కృతి సనన్ లుక్.. పిక్స్ వైరల్
సౌత్, నార్త్ హీరోయిన్లంతా కూడా సమంతకు విషెస్ చెప్పారు. మృణాల్ ఠాకూర్, అనుష్క శర్మ, రకుల్, కీర్తి సురేష్ ఇలా చాలా మంది హీరోయిన్లు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. కానీ టాలీవుడ్ హీరోలు మాత్రమే ఆమెను పక్కన పెట్టినట్టు అనిపిస్తోంది. సమంత అయితే అందరి హీరోల బర్త్ డేకు విషెస్ చెబుతుంటుంది. అఖిల్ బర్త్ డేకు కూడా సమంత విష్ చేసింది. కానీ అఖిల్ మాత్రం సోషల్ మీడియాలో సమంతకు విషెస్ చెప్పలేదు.
Also Read: Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook