Samantha Stylist Preetham : అర్దనగ్నంగా సమంత ఫ్రెండ్ ప్రీతమ్.. ఆ మూడ్‌లో ఉన్నట్టున్నాడే
Samantha Stylist Preetham Jukalker సమంత ఫ్రెండ్, స్టైలిష్ట్ అయిన ప్రీతమ్ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ అయిపోయాడు. అయితే సమంతతో మాత్రం ప్రీతమ్ ఎక్కువగా కనిపించడం లేదు. ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నారు.
Preetham Jukalker Shirtless pic సమంత ఫ్రెండ్‌గా, స్టైలిష్ట్‌గా ప్రీతమ్ జుకల్కర్ పేరు ఎంతగా మార్మోగిపోయిందో అందరికీ తెలిసిందే. సమంత ప్రీతమ్ రిలేషన్ మీద కూడా ఎన్ని రూమర్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. ఇక ప్రీతమ్‌ను అయితే దారుణాతి దారుణంగా ట్రోల్ చేసేవారు. సమంత నాగ చైతన్య విడాకులకు ప్రీతమ్ ముఖ్య కారణం అని అంతా అన్నారు. కానీ ఆ తరువాత ప్రీతమ్, సమంత నోరు విప్పి అసలు విషయం చెప్పేశారు.
తనకు అక్రమ సంబంధాలు అంటగడుతూ రూమర్లు క్రియేట్ చేస్తున్నారని సమంత మండి పడింది. ఇక తాను సమంతను అక్కా అని పిలుస్తాను అని, ఆ విషయం నాగ చైతన్యకి కూడా తెలుసు అంటూ ప్రీతమ్ చెబుతూ బాధపడ్డాడు. కానీ సమంత, ప్రీతమ్ మధ్య రిలేషన్ మీద ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూనే వచ్చింది. అయితే గత కొన్ని నెలల నుంచి ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడినట్టుంది.
సమంత ప్రీతమ్ సాధన ఓ గ్యాంగ్‌లా కలిసి ఉంటారు. ఈ ముగ్గురూ కలిసి సెట్స్‌లో అల్లరి చేస్తుంటారు. హోటల్ రూంలో హంగామా చేస్తుంటారు. ఈ ముగ్గురూ కలిసి అప్పట్లో రీల్స్ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి కనిపించడం లేదు. ప్రీతమ్, సాధనలు తమ పనుల్లో బిజీగా ఉండగా.. సమంత తన సినిమా షూటింగ్‌లతో తాను బిజీగా ఉంటోంది.
[[{"fid":"265768","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
అయితే ప్రీతమ్ తాజాగా షర్ట్ లేకుండా కనిపించాడు. ఉదయాన్నే అలా భక్తి పారవశ్యంలో మునిగినట్టున్నాడు. ప్రేమ కావాలంటే నువ్వు నీలా ఉండు.. తెలివి కావాలంటే మౌనంగా ఉండు అంటూ ఇలా కొటేషన్‌లు కూడా పెట్టేశాడు. మొత్తానికి ఇలా అర్దనగ్నంగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు ప్రీతమ్.
ప్రస్తుతం సమంతకు కాకుండా ప్రీతమ్ జుకలక్కర్ అల్లు స్నేహారెడ్డి, శ్రీజ కొణిదెల వంటివారికి స్టైలిష్ట్‌గా పని చేస్తున్నాడు. ప్రీతమ్ డిజైన్ చేసిన దుస్తులను వారి ధరించి ఫోటో షూట్లు చేస్తోన్న సంగతి తెలిసిందే. రామ్‌కు కూడా ప్రీతమ్ దుస్తులను డిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది.
Also Read: Chiranjeevi Twitter DP : డీపీ మార్చిన చిరంజీవి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook