Samantha Dance: విజయ్ పాటకు ముందు పూజా హెగ్డె.. ఆ తర్వాత సమంత! పోటాపోటీ స్టెప్పులు అదిరాయి!!
Samantha dances Arabic Kuthu song: పూజా హెగ్డే ఛాలెంజ్‌కు సమంత స్పందించారు. ఎయిర్ పోర్టు ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై సమంత `అరబిక్ కుతు` పాటకు అదిరే డ్యాన్స్ చేశారు.
Samantha takes Pooja Hegde's dance challenge: టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతైన్యతో విడాకుల అనంతరం సమంత దూకుడు పెంచారు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పోతున్నారు. ప్రస్తుతం వెకేషన్స్, షూటింగ్స్ అంటూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తున్నారు. తన లేటేస్ట్ ఫోటోస్,మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు. సామ్ ఇటీవల వర్కవుట్స్ వీడియోస్ షేర్ చేసి నెటిజన్లకు ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. సామ్ లానే పూజా హెగ్డే కూడా తన ఫాలోవర్లకు ఓ ఛాలెంజ్ విసిరారు.
దళపతి విజయ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించిన తమిళ తాజా చిత్రం 'బీస్ట్'. 'వాలెంటైన్స్ డే' సందర్భంగా బీస్ట్ సినిమా నుంచి 'అరబిక్ కుతు' అనే పాటను చిత్ర బృదం విడుదల చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించిన ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే నెట్టింట వైరల్ అయింది. ఈ పాటకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమదైన స్టైల్‌లో స్టెప్పులు వేస్తున్నారు. తాజాగా పూజా హెగ్డే ఈ పాటకు మాల్దీవులలో స్టెప్పులు వేస్తూ.. తనలాగే డ్యాన్స్ చేయాలని సవాలు చేశారు.
పూజా హెగ్డే ఛాలెంజ్‌కు సమంత స్పందించారు. ఎయిర్ పోర్టు ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై సమంత 'అరబిక్ కుతు' పాటకు అదిరే డ్యాన్స్ చేశారు. బుట్టబొమ్మకు పోటాపోటీగా సామ్ స్టెప్పులు వేసి వావ్ అనిపించారు. ఈ సమయంలో సామ్ బ్లాక్ టోన్డ్ లెగ్గింగ్, బ్లూ డెనిమ్ ట్రౌజర్ వేసుకుని బ్లాక్ మాస్క్‌తో మెరిశారు. ఈ వీడియోను సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'మరో లేట్ నైట్ ఫ్లైట్.. ఇవాళ్టి రాత్రికి హలిమితి హబిబో రిథమ్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. సమంత పోస్ట్ తాజా వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. అందరూ సామ్ స్టెప్పులకు ఫిదా అవుతున్నారు. పుష్ప సినిమాలో 'ఉ అంటావా మావ..ఊ ఊ అంటావా మావ' అంటూ అదిరిపోయే మాస్ డాన్స్ చేసిన విషయం తెలిసిందే.
గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'శాకుంతలం' ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు విఘ్నేశ్ శివన్ డైరెక్షన్‌లో నయనతార, విజయ్ సేతుపతితో కలిసి 'కాతువాకుల రెండు కాధల్' అనే సినిమాలో కూడా సామ్ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. మరోవైపు యశోద సినిమాలో సమంత లీడ్ రోల్ చేస్తున్నారు. ఇక సామ్ మరో వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు అని సమాచారం తెలుస్తోంది.
Also Read: Bachchhan Paandey Trailer: బచ్చన్ పాండే ట్రైలర్ చూశారా?.. కామెడి ప్లస్ అరాచకం కలగలిపిన వీడియో!!
Also Read: Chittoor Road Accident: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు అక్కడికక్కడే మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook