Samantha Bollywood Debut finalized: ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కించుకుంది హీరోయిన్ సమంత. ఆ తర్వాత పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్ ద్వారా ఆ క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఇప్పటికే కొన్ని రోజులు హైదరాబాద్ లో మరికొన్ని రోజులు ముంబైలో ఉంటున్న సమంత బాలీవుడ్ ఎంట్రీ కోసమే అక్కడ ఎక్కువగా గడుపుతోందని ప్రచారం జరుగుతోంది. ఇక ఎట్టకేలకు ఒక మంచి బాలీవుడ్ ప్రాజెక్ట్ ను సామంత సెట్ చేసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె పలు బాలీవుడ్ సినిమాలు ఒప్పుకున్నట్లు వార్తలు రాగా దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఈ మధ్యనే తాప్సీ పన్ను తాను నిర్మించే సినిమాలో సమంత నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు తాజాగా ప్రచారం జరుగుతున్న వరకు ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ఒక బాలీవుడ్ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాని దినేష్ విజయ్ నిర్మించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన రాతకోతలు ఇప్పటికే పూర్తయ్యాయి అని, ప్రస్తుతం షెడ్యూల్స్ కి సంబంధించిన ప్లానింగ్ కూడా జరుగుతుంది అని అంటున్నారు. ఇక ఇదంతా నిజమైతే కనుక సమంత నటిస్తున్న మొట్టమొదటి హిందీ సినిమాకి రంగం సిద్ధమైనట్టే చెప్పాలి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. 


ఇక తాప్సీ పన్ను నిర్మించే ఒక సినిమాలో సమంత నటిస్తున్నట్టు ఆమె క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో అది ఎలాంటి సినిమా అనే విషయం మీద కూడా ఇప్పుడు పలు రకాల వార్తల పుట్టుకు వస్తున్నాయి. ఇది ఒక భారీ బడ్జెట్ మైథాలజికల్ సబ్జెక్టు ఉన్న సినిమా అని తెలుస్తోంది. ఇక ఇప్పటికే సమంత తమిళ, తెలుగు భాషలలో వరుస సినిమాలు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఆమె చేసిన యశోద, శాకుంతలం సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా ఆమె విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ఖుషీ అనే సినిమా మాత్రం షూటింగ్ దశలో ఉంది. సమంత ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ లో కూడా భాగమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఆమె ఒక్కసారిగా నేషనల్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోయారు.


Also Read: Naga Chaitanya: సమంత కుక్కకి నాగచైతన్య థాంక్స్.. ప్రేమించడం ఎలానో నేర్పావంటూ ఎమోషనల్


Also Read: Vijayendra Prasad: రాజ్యసభకు బాహుబలి క్రియేటర్ విజయేంద్ర ప్రసాద్.. ఇళయరాజా సహా ఎవరెవరంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు,    వినోదం,    రాజకీయాలు,    విద్య,    ఉద్యోగాలు,    హెల్త్,    లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter ,    Facebook