Yashoda Thank You overseas Collections : సమంత నటించిన యశోద సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందని, ఆడియెన్స్ ఆదరిస్తారని మరోసారి యశోద నిరూపించింది. సమంత తప్పా ఇంకే ఫ్యాక్టర్ బలంగా లేని యశోద సినిమాను జనాలు నెత్తిన పెట్టుకుంటున్నారు. యశోద సినిమాకు అంతా తానై నిలబడింది సమంత. యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సీన్స్ ఇలా అన్నింట్లోనూ సమంత దుమ్ములేపేసింది. మొదటి రోజు వచ్చిన పాజిటివ్ టాక్, మంచి మౌత్ టాక్‌తో రెండో రోజు వసూళ్లు పెరిగాయి. మూడో రోజు కూడా మంచి వసూళ్లు వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా మొదటి రోజులు అంటే వీకెండ్ మొత్తంలో యశోద సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఇరవై కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే పది కోట్ల షేర్ కొల్లగొట్టేసిందన్న మాట. అయితే ఓవర్సీస్‌లో మాత్రం పూర్తిగా యశోద డామినేషన్ కనిపిస్తోంది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్లే     $200k డాలర్లు దాటాయి. రెండో రోజు వరకు $300k డాలర్లు వచ్చాయి. ఇక మూడు రోజుల్లో అక్కడ $400k డాలర్లు కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది.


ఇక యశోద ఇలా హాఫ్ మిలియన్, మిలియన్ డాలర్ల క్లబ్బులోకి దూసుకెళ్తోంది. కానీ నాగ చైతన్య థాంక్యూ సినిమా ఎన్నో అంచనాల నడుము రిలీజ్ అయింది. అసలే ఓవర్సీస్ ప్రేక్షకులకు క్లాస్ సినిమాలంటే ఎంతో మక్కువ. అలాంటిది థాంక్యూ సినిమాను దారుణాతి దారుణంగా తిరస్కరించేశారు. థాంక్యూ సినిమాకు లైఫ్ టైం కలెక్షన్లు కూడా     $200k డాలర్లు దాటలేదు. కానీ సమంత యశోద మాత్రం మూడు రోజుల్లోనే $400k డాలర్లను కలెక్ట్ చేసింది.


అంటే సమంత డామినేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమంత ముందు ఓవర్సీస్‌లో నాగ చైతన్య నిలబడలేకపోయాడు. థాంక్యూ సినిమా మీద నాగ చైతన్య ఎంతో నమ్మకంగా ఉన్నాడు. డైలాగ్స్, విజువల్స్ ఇలా అన్నింట్లో టాప్ నాచ్‌లా ఉన్నా కూడా కథ, కథనం సెట్ అవ్వకపోవడంతో సినిమా బెడిసి కొట్టేసింది. సమంత యశోద మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.


Also Read : Super Star Krishna Cardiac Arrest : సూపర్ స్టార్ కృష్ణకు గుండెపోటు.. క్రిటికల్ స్టేజ్.. వైద్యులు ఏమన్నారంటే


Also Read : Bigg Boss Vasanthi Buzz Interview : నీట్‌గా రెడీ అవ్వడం తప్పా ఆడిందేమీ లేదు.. వసంతి పరువుతీసిన యాంకర్ శివ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook