Yashoda Movie Day 1 Collections : సమంత యశోద సినిమాకు పెట్టిన బడ్జెట్, చేసిన బిజినెస్ మీద రకరకాల వార్తలు వచ్చాయి. సినిమాకు పెట్టిన దానికి, అమ్మిన దానికి చాలా తేడా ఉందని, నిర్మాత సేఫ్ జోన్‌లో ఉన్నాడంటూ ట్రేడ్ వర్గాలు చెప్పుకున్నాయి. థియేట్రికల్ బిజినెస్ ఎలా జరుగుతుందన్నది, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తాయా?లేదా? అన్నది ఇక చూడాలి. దాదాపు యాభై కోట్ల వరకు బిజినెస్ చేసిందని తెలుస్తోంది. మరి ఇందులో థియేట్రికల్ రన్ నుంచి ఎంత రాబడుతుందన్నది చూడాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యశోద సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మిగిలిన భాషల్లోకి డబ్ చేశారు. ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేశారు. అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దాదాపు $200K డాలర్లను రాబట్టినట్టు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లోనే ఓవర్సీస్‌లో యశోద బ్రేక్ ఈవెన్ అయ్యేట్టుగా కనిపిస్తోంది.


కానీ ఇండియాలో ఈ మూవీ కలెక్షన్లు మాత్రం ఆశించినంతగా రానట్టు కనిపిస్తోంది. సమంత ఈ రేంజ్‌లో ఆడియెన్స్‌ను థియేటర్‌కు రప్పించడం అంటే మామూలు విషయం కాదు. అయితే మొదటి రోజు అన్ని భాషల్లోంచి.. అన్ని ఏరియాల్లోంచి మొత్తంగా మూడు కోట్ల వరకు రాబట్టేసినట్టు తెలుస్తోంది. అయితే ఇది సమంత రేంజ్‌ కంటే ఎక్కువే అయినా.. కలెక్షన్ల పరంగా చూస్తే మాత్రం కాస్త తక్కువే అనిపిస్తోంది.


ఈ లెక్కన యశోద బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా సమయం కావాల్సి ఉంటుంది. మొదటి వారాంతం వరకు యశోద బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది. టాక్ బాగా రావడంతో.. వీకెండ్‌ కలెక్షన్లు మాత్రం బాగానే ఉండేట్టు కనిపిస్తోంది. ఆ తరువాత ఎలా రన్ అవుతుందనే దాన్ని బట్టి కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ మార్క్‌ గురించి తెలుస్తుంది.


నోట్: ఈ సమాచారం వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించినది, దీన్ని జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు.
 


Also Read : Jr NTR New Look : ఎన్టీఆర్ న్యూ లుక్.. బండ్లన్న ట్వీట్.. నెటిజన్ల ట్రోలింగ్


Also Read : Yashoda Movie Copied : యశోదపై ట్రోలింగ్.. దొరికిపోయిన దర్శకులు.. సమంతకు ఎంత కష్టమొచ్చే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook