Preetham Jukalker: సమంతతో నా రిలేషన్ షిప్ పై చైతూ స్పందించాలి: ప్రీతమ్ జుకల్కర్
చై-సామ్ విడాకుల విషయంలో తనతోపాటు సమంతపై వస్తోన్న ట్రోల్స్ పై నాగచైతన్య స్పందించకపోవడం బాధను కలిగిస్తోందని సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ అన్నారు. ఈ విషయంపై చై స్పందించాలని ప్రీతమ్ కోరారు.
ChaySam Divorce: చై-సామ్ విడాకుల విషయంలో తనతో పాటు సమంతపై కూడా వస్తోన్న ట్రోలింగ్‌పై నాగచైతన్య స్పందించాలని ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్(Preetham Jukalker) కోరారు. ఈ రూమర్స్ విషయంలో నాగచైతన్య(Naga Chaitanya) స్పందిస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని అన్నారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రీతమ్ జుకల్కర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
సమంతను అక్క అని పిలుస్తా..
ఈ సందర్భంగా ప్రీతమ్ జుకల్కర్(Preetham Jukalker) మాట్లాడుతూ.. ”నాతో పాటు సమంతపై వస్తోన్న ట్రోలింగ్‌కు నాగచైతన్య స్పందించకపోవడం బాధను కలిగిస్తోంది. నేను సమంత(Samantha)ను జీజీ(తెలుగులో అక్క అని అర్ధం) అని పిలుస్తాను. ఈ విషయం నాగచైతన్యతో పాటు చాలామందికి తెలుసు. ఆయన ఈ రూమర్స్(Rumors)పై స్పందించకపోవడం బాధను కలిగిస్తోంది.. ఒక్క స్టేట్‌మెంట్ ఇస్తే ఖచ్చితంగా పరిస్థితుల్లో మార్పు వస్తుంది” అని పేర్కొన్నారు.
Also read: MAA Elections results: ప్రకాష్ రాజ్‌కు షాక్.. 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు..
ఇటువంటి సమయంలో సమంతకు తాను అండగా నిలుస్తానని ప్రీతమ్ జుకల్కర్ చెప్పుకొచ్చారు. మరోవైపు సమంతకు సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా బాసటగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా(Social Media) ఖాతాల ద్వార సమంతపై వస్తున్న తప్పుడు వార్తలను ఖండించడమే కాకుండా.. అసలు విషయం అది కాదని.. సమంత పిల్లలను కావాలనుకుందని చెప్పుకొస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook