MAA Elections results: ప్రకాష్ రాజ్‌కు షాక్.. 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు..

MAA Elections results: ఉత్కంఠభరితంగా సాగిన ‘'మా' అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే గెలుపొందారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2021, 09:56 PM IST
  • 'మా' అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపు
  • కోశాధికారిగా శివబాలాజీ, జనరల్ సెక్రటరీగా రఘుబాబు ఘన విజయం
  • ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి శ్రీకాంత్ గెలుపు
MAA Elections results: ప్రకాష్ రాజ్‌కు షాక్.. 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు..

‘MAA Elections results: 'మా' ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.  హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో విష్ణు(manchu vishnu) ఘన విజయం సాధించారు. ఇది విష్ణు ప్యానల్‌కు ఏకపక్ష విజయమనే చెప్పాలి. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే విజయం సాధించారు.

ప్రధాన పోస్టుల్లో...

ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికోసం ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌(PrakashRaj Panel) నుంచి శ్రీకాంత్‌, మంచు విష్ణు ప్యానల్‌ నుంచి బాబుమోహన్‌ పోటీ పడ్డారు. నువ్వా నేనా అన్నట్టు సాగిన హోరా హోరీ పోరులో శ్రీకాంత్‌(Srikanth) విజయం సాధించారు. 'విష్ణు ప్యానల్‌ తరఫు నుంచి కోశాధికారిగా బరిలో నిలిచిన శివ బాలాజీ(Siva Balaji)  విజయం సాధించారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లోని నాగినీడుపై శివబాలాజీ  గెలుపొందారు. శివబాలాజీకి 316 ఓట్లు రాగా, నాగినీడు 284 ఓట్లు పడ్డాయి. ‘'మా'’ జనరల్‌ సెక్రటరీ ఎన్నికలో రఘుబాబు విజయం సాధించారు. జీవిత రాజశేఖర్‌(Jeevitha Rajasekhar)పై ఏడు ఓట్ల తేడాతో రఘుబాబు గెలుపొందారు. వైస్‌ ప్రెసిడెంట్‌ పదవి కోసం జరిగిన పోటీలో విష్ణు ఫ్యానెల్ కు చెందిన మాదాల రవి..ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి పోటీ చేసిన బెనర్జీపై గెలుపొందారు.

Also Read: MAA Elections 2021 : వాటమ్మా.. వాటీజ్ దిస్ అమ్మా అంటూ విష్ణు, ప్రకాశ్‌రాజ్‌లపై మంచు మనోజ్‌ సెటైర్

కార్యవర్గ సభ్యులు వీరే..
మంచు విష్ణు ప్యానల్‌లో ఎనిమిది మంది విజయం సాధించారు. మాణిక్ , హరినాథ్ , బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత కార్యవర్గసభ్యులుగా గెలుపొందారు.  ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో అనసూయ, సురేశ్‌ కొండేటి, కౌశిక్‌, శివారెడ్డి కార్యవర్గ సభ్యులుగా గెలుపొందారు. మోహన్‌బాబు, మురళీ మోహన్‌, నరేశ్‌ తదితరులు కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News