Same Climax in Veera Simha Reddy and Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కానుకగా ఒక రోజు గ్యాప్ తో విడుదలైన సంగతి తెలిసిందే. జనవరి 12వ తేదీన ముందుగా నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా విడుదల కాగా జనవరి 13వ తేదీన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడం గమనార్హం. అంతేగాక రెండు సినిమాల్లోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటించడం మరో ఆసక్తికర అంశం. అయితే సినిమాలు రెండూ సంక్రాంతికి వస్తున్నాయని చెప్పినప్పటి నుంచి దాదాపుగా అన్ని విషయాల్లో ఈ రెండు సినిమాలను పోలుస్తూ వస్తున్నారు. సినిమాల నుంచి పాటలు విడుదలైన పోస్టర్లు విడుదలైన ప్రతి చిన్న విషయానికి కూడా ఒక సినిమాతో మరో సినిమాని పోలుస్తూ లెక్కలు కడుతున్నారు.


అయితే ఈ రెండు సినిమాలలో చాలా సారూప్యతలు ఉన్నాయి. వీర సింహారెడ్డి సినిమా పూర్తిస్థాయి ఫ్యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొంది సిస్టర్ సెంటిమెంట్ తో నడిస్తే, వాల్తేరు వీరయ్య సినిమా పూర్తిస్థాయి మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపొందించబడి బ్రదర్స్ సెంటిమెంట్ తో నడుస్తుంది. ఇక వీర సింహారెడ్డి సినిమాలో నందమూరి బాలకృష్ణ సవతి తల్లి కుమార్తెగా వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించగా వాల్తేరు వీరయ్య సినిమాలో తన సవతి తల్లి కొడుకుగా రవితేజ కనిపిస్తారు.


ఇక కలిసి అనుకున్నారో లేక పొరపాటున అలా కలిసిపోయాయో తెలియదు కానీ రెండు సినిమాలు దాదాపుగా ఇదే పాయింట్తో తెరకెక్కాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీర సింహారెడ్డి సినిమా క్లైమాక్స్లో ముసలిమడుగు ప్రతాపరెడ్డి అంటే విలన్ దునియా విజయ్ ని బాలకృష్ణ తల నరికి సినిమా ముగిస్తాడు, అదే వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా కాలా అలియాస్ మైకేల్(ప్రకాష్ రాజ్)ను చిరంజీవి కూడా తల నరికి సినిమా ముగిస్తాడు. ఈ రెండు విషయాలు కూడా రెండు సినిమాల్లోనూ ఒకేలా ఉండటం గమనార్హం.
Also Read: Waltair Veerayya OTT Release: అప్పుడే OTTలో వాల్తేరు వీరయ్య రిలీజ్... ఎందులో అంటే?


Also Read: Veera Simha Reddy Collections: బాక్స్ ఆఫీస్ ఊచకోత అంటే ఇదేనేమో.. బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook