Anasuya Bharadwaj in Vimanam సముద్రఖని, అనసూయ, మీరా జాస్మిన్ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా విమానం. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఆడియెన్స్‌ను అల‌రింంచేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా కోసం సముద్రఖని దివ్యాంగుడిలా కనిపించబోతోన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంగ వైక‌ల్యంతో బాధ‌ప‌డే మ‌ధ్య వ‌య‌స్కుడిగా, భార్య లేక‌పోయినా పిల్లాడిని  జాగ్ర‌త్త‌గా చూసుకునే వీర‌య్య అనే తండ్రి పాత్ర‌లో సముద్రఖని కనిపించబోతోన్నాడు. ఈ సినిమాను జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.


 



విమానం ప్రోమోను మేక‌ర్స్ శుక్ర‌వారం విడుద‌ల చేశారు. ఇక ఈ ప్రోమోను చూస్తుంటే.. ఓ చిన్న పిల్లాడి ఆశ, పేద తండ్రి కలలు చూపించారు. మధ్య తరగతి తండ్రీ కొడుకుల మ‌ధ్య అనుబంధం ప్రోమోలో స్పష్టంగా క‌నిపిస్తోంది. ఓసారైనా త‌న‌ని విమానం ఎక్కించ‌మ‌ని అడుగుతుంటాడు కొడుకు. విమానం ఎక్కటానికి ఎందుకంత ఇష్టం నీకు అని ఆ తండ్రి అడిగితే.. పై నుంచి చూస్తే అన్నీ చిన్న‌గా క‌నిపిస్తాయ‌ంట నాన్నా అని అమాయకంగా చెబుతాడు ఆ పిల్లాడు.


Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్


ఇక తండ్రి కూర్చున్న మూడు చక్రాల చైర్‌ను గాల్లోకి లేపేందుకు ప్రయత్నిస్తాడు ఆ పిల్లాడు. ఏం చేస్తున్నావ్‌రా విమానం అనుకుంటున్నావా? అని తండ్రి అంటే.. భయపడ్డావా? నాన్నా అని ఆ పిల్లాడు అనడం, వీరి సంభాషణకు తగ్గట్టుగా గాల్లోకి విమానం టేక్ ఆఫ్ అయ్యే సీన్లు చూపించడంతో సినిమాలోని కథ ఏంటన్నది ఎంతో చక్కగా వివరించినట్టు అయింది. ప్రేక్ష‌కులు న‌చ్చే, మెచ్చే కంటెంట్‌ను అందించ‌ట‌మే తమ ల‌క్ష్యమని ఈ సందర్భంగా జీ స్టూడియోస్‌ సౌత్ మూవీస్ హెడ్ అక్ష‌య్ క్రేజీవాల్ అన్నాడు. ఈ సినిమాను జూన్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.


Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook