Samyuktha Menon gives clarity about Trivikram Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'భీమ్లా నాయక్' సినిమా ద్వారా కేరళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఈ మూవీలో రానా దగ్గుబాటి భార్య క్యారెక్టర్‌లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భీమ్లా నాయక్ చిత్రంలో సంయుక్త నటనకు అందరూ ఫిదా అయ్యారు. అందుకే ఈ ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. వశిష్ఠ్‌ దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్‌ హీరోగా రూపొందిన 'బింబిసార' సినిమాలో కూడా అవకాశం దక్కించుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ్ హీరో ధనుష్ 'సర్' ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా చేస్తున్నారు. సర్ సినిమాలో సంయుక్తకు హీరోయిన్‌గా ఛాన్స్ రావడానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కారణం అని సోషల్ మీడియాలో రూమర్లు వస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయనున్న సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డేతో పాటు మరో హీరోయిన్‌గా సంయుక్త నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల త్రివిక్రమ్ చేస్తున్న ప్రతి సినిమాలో ఇద్దరేసి హీరోయిన్‌లు ఉంటున్న విషయం తెలిసిందే. దాంతో ఈ రూమర్లు మరింత బలం చేకూరింది. అయితే వీటన్నింటికీ మలయాళీ బ్యూటీ చెక్ పెట్టేశారు.


తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంయుక్త మీనన్‌ మాట్లాడుతూ... 'ఆరంభంలో రూమర్లను చూసి చాలా బాధేసింది. ధనుష్‌తో సర్ చిత్రం మొదలైన మూడు రోజులకే నేను సినిమా నుంచి బయటకు వచ్చానని వార్తలు వచ్చాయి. ఆ సినిమాను పూర్తి చేశాను. మరోసారి నాపా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో నేను నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. ఇప్పుడు రూమర్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. చూసి నవ్వుకుంటున్నా. రూమర్లు రాసేవారికి ఎంతో సృజనాత్మకత ఉండాలి' ని అన్నారు. 


Also Read: Pooja Hegde Pics: ముద్దు పెట్టిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మ అందాలకు ఫిదా అవ్వాల్సిందే!


Also Read: Ketika Sharma Images: క్లీవేజ్ షోతో కైపెక్కిస్తున్న కేతిక శర్మ.. మతిపోయే అందాలు చూడతరమా!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook