Liger Movie Sand Art: విజయ్ దేవరకొండ సినిమాకు అరుదైన గౌరవం.. అదిరిపోయిన `లైగర్` మూవీ సాండ్ ఆర్ట్..
Liger Movie: విజయ్ దేవరకొండ `లైగర్` సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పై ఓ లుక్కేయండి.
Liger Movie Sand Art: పూరిజగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda) నటిస్తున్న చిత్రం లైగర్ (Liger Movie). ఛార్మి, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ కు విపరీతమైన స్పందన వచ్చింది. విజయ్ లుక్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇదిలా ఉంటే.. లైగర్ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. సాండ్ ఆర్టిస్టు దశరత్ మోహంట (Sand artist Dashrath Mohanta) అద్బుతమైన లైగర్ ఆర్ట్ ను వేశాడు. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ (Mike Tyson)ల ముఖాలతో ఈ ఆర్ట్ రూపొందించారు. అత్యంత ప్రముఖులకు మాత్రమే ఇలా ఆర్ట్స్ వేస్తారు. ఇప్పుడు లైగర్ సినిమాకు ఈ ఆర్ట్ వేయడం అభిమానులను ఆకట్టుకుంటుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అలాగే సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లో ఫాలోయింగ్ పెంచుకోనున్నాడు విజయ్ .
Also Read: Malaika Arora Braless: బ్రాలెస్‌గా బయటికొచ్చేసిన మలైకా అరోరా.. ముంబై వీధుల్లో చక్కర్లు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook