Michael: సందీప్ కిషన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మైఖేల్’ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్…ఈ రోజు జీ సినిమాలో
Sandeep Kishan: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో `సందీప్ కిషన్` ఈమధ్య చేసిన పాన్ ఇండియా సినిమా `మైఖేల్`. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలు అయితే అందుకోలేకపోయింది. తమిళ దర్శకుడు రంజిత్ జేయకుడి ఈ మూవీని తెరకెక్కించారు. కాగా ఇప్పుడు ఈ సినిమా తెలుగు వర్షన్ డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైపోయింది.
Michael television premeier: జీ సినిమాలు అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు మక్కువ ఎక్కువే. దానికి ముఖ్య కారణం తరచుగా ప్రతి వారం ఏదో ఒక మంచి సినిమాతో ప్రేక్షకులను అలరించడం. కాగా ఈ వారం కూడా జీ సినిమాలు మరో కొత్త సినిమాతో మన ముందుకు రాబోతోంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన మైఖేల్ సినిమాని ఈ వారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అందించేందుకు జీ సినిమాలు సిద్ధమైంది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామా మైఖేల్ నవంబర్ 25, శనివారం సాయంత్రం 6 గంటలకు మీ జీ సినిమాలులో ఈ సినిమా ప్రసారం కానుంది. డైరెక్టర్ రంజిత్ జయకోడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందకు వచ్చేస్తోంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓ గ్యాంగ్ స్టర్ చుట్టూ తిరుగుతుంది. మైఖేల్ (సందీప్ కిషన్) చిన్నప్పటి నుంచే తన తండ్రిని చంపాలనే కోరికతో గురునాథ్ (గౌతం మీనన్) అనే పెద్ద గ్యాంగ్ స్టర్ దగ్గరకు చేరతాడు. తనపై హత్య ప్రయత్నం చేసిన వారిని చంపమని గురునాథ్ మైఖేల్ కి చెబుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మైఖేల్ గురునాథ్ కూతురు తీరా (దివ్యాంశ కౌశిక్) కి దగ్గర అవుతాడు. ఇంతకీ, మైఖేల్ తండ్రి ఎవరు ? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో సందీప్ తన యాక్షన్ తో అదరగొట్టాడు.
యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ హీరోహీరోయిన్లుగా నటించగా, గౌతం మీనన్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, అనసూయ, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలకపాత్రల్లో కనిపించారు. ఇక, ఈ సినిమాకి సామ్ సి.ఎస్ అందించిన సంగీతం హైలెట్గా నిలిచింది. ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన ‘నీవుంటే చాలు..’ పాట సంగీత విపరీతంగా ప్రజాదరణ పొందింది. మరి ఈ సినిమాను మీరు మిస్ అవకుండా చూసేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook