Allu Arjun: అర్జున్ రెడ్డి సినిమా అనగానే మనకు గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి అంటే విజయ్ దేవరకొండ.. విజయ్ దేవరకొండ అంటే అర్జున్ రెడ్డి అన్నట్టు ఆ సినిమా ఉంటుంది. అంతలా ఆ చిత్రాంలో అర్జున్ రెడ్డి క్యారెక్టర్ కి జీవం పోసారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా మిగిలింది.. ఒకరకంగా చెప్పాలి అంటే ప్రస్తుతం తెలుగులో వస్తోన్న బోల్డ్ సీన్స్ కంటెంట్ ఈ సినిమా నుంచే మొదలైంది అని చెప్పొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్రంతో సందీప్ రెడ్డివంగా కూడా రాంగోపాల్ వర్మ తరువాత అంతటి సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ దర్శకుడు ప్రస్తుతం చేసిన యానిమల్ సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో అసలు అర్జున్ రెడ్డి.. సినిమా విజయ్ దేవరకొండ ని మైండ్ లో పెట్టుకొని రాసిన కథ కాదు అంటూ ఈ దర్శకుడు చెప్పిన మాటలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. 


ఎవరికైనా అర్జున్ రెడ్డి సినిమా చూస్తే సందీప్ రెడ్డి.. విజయ్ దేవరకొండని మైండ్ లో పెట్టుకొని ఆ క్యారెక్టర్ రాసినట్టు అనిపించక మానదు.. కానీ ఈ దర్శకుడు కి మాత్రం కథ రాసేటప్పుడు అసలు విజయ దేవరకొండ మైండ్ లోనే లేరట. అప్పటికి విజయ్ దేవరకొండ నటించిన చిత్రాలలో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం పెళ్లిచూపులు మాత్రమే. అది చాలా క్లాస్ సినిమా కాగా విజయ్ మాస్ ఇమేజ్ తెచ్చుకుంది అర్జున్ రెడ్డి సినిమాతో. అందుకే ఈ కథ రాసేటప్పుడు సందీప్ ఈ కథ మొత్తం అల్లు అర్జున్ ని మైండ్ లో పెట్టుకొని రాశారట.


ఇంతకుముందే ఒకసారి ‘అర్జున్ రెడ్డి’ కోసం అల్లు అర్జున్ ని మొదటిగా అనుకున్నట్లు వెల్లడించిన సందీప్.. ఈమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దాని గురించి మాట్లాడాడు. బన్నీని ఊహించుకుంటూనే ఆ పాత్ర, కథ మొత్తం రాసినట్లు తెలిపాడు. అల్లు అర్జున్ ని కలిసి ఈ కథ చెప్పాలని ప్రయత్నించానని.. కానీ కుదరలేదని అతనన్నాడు. అంతేకాకుండా అర్జున్ రెడ్డి సూపర్ హిట్ సాధించగానే వెంటనే సందీప్ రెడ్డి అల్లు అర్జున్ ని కలిసి వేరే కథ ఒకటి చెప్పినట్లు కూడా తెలిపాడు. తమ కలయికలో కచ్చితంగా సినిమా త్వరలోనే ఉంటుందని.. బన్నీ కోసం ఒక ప్రత్యేకమైన కథ రాస్తానని అతనన్నాడు. 


కాగా ప్రస్తుతం సందీప్ రెడ్డి ప్రభాస్‌తో తీయబోయే ‘స్పిరిట్’ సినిమా కథ పనిలో బిజీగా ఉన్నారు ఇక ఈ చిత్రం అవ్వగానే ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ ఉంటుంది. ఈ రెండు చిత్రాల తర్వాత సందీప్ రెడ్డి, అల్లు అర్జున్ సినిమా తెరపైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఇదీ చదవండి: Post Office MIS: పోస్ట్ఆఫీస్ బంపర్ ఆఫర్..జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తేచాలు రూ.5 లక్షలు


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter