KGF Chapter 2: పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ ఛాప్టర్ 2 త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ అంచనాలు నెలకొన్న కేజీఎఫ్ 2 సినిమాలో నెగెటివ్ రోల్ పోషిస్తున్న సంజయ్ దత్ కొత్త లుక్‌లో కన్పించబోతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ కన్నడ నటుడు యశ్ హీరోగా ప్రశాంత్ నీల్(Prashant neel) తెరకెక్కించిన కేజీఎఫ్ సృష్టించిన విజయం అంతా ఇంతా కాదు. ఇప్పుడు కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ ఛాప్టర్ 2 తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్నింటికంటే ప్రధాన ఆకర్షణ ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రలో కన్పించడం. సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా కేజీఎఫ్ 2 (KGF Chapter 2)లో అధీరా పాత్రతో ఉన్న లుక్‌ను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది.ఈ కొత్త లుక్‌లో సంజయ్ దత్..చేతిలో ఖడ్గం పట్టుకుని పవర్‌ఫుల్‌గా కన్పిస్తున్నాడు. ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవుతోంది. సినిమాలో యష్, సంజయ్ దత్ (Sanjay Dutt)మధ్య ఉన్న భారీ యాక్షన్ సన్నివేశం సినిమాకు హైలైట్ కానుందని సినిమా మేకర్స్ వెల్లడించారు.కేజీఎఫ్ ఛాప్టర్ 2లో పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలున్నాయి.ఈ సినిమా త్వరలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. 


Also read: Third wave: ఏపీలో సినిమా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్.. కండిషన్స్ అప్లై


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook