Sankranthi 2022 Movies in OTT: ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు, ఒక చిన్న సినిమా థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో ఇద్దరు బడా హీరోలు నటించిన సినిమాలు విడుదలవగా తమిళ్ లో ఇద్దరు బడా హీరోలు నటించిన సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. అలా ముందుగా రేసులోకి అజిత్ హీరోగా నటించిన తెగింపు అనే సినిమా రిలీజ్ అయింది. తమిళంలో హెచ్ వినోద్ తునివు అనే పేరుతో తెరకెక్కించిన ఈ సినిమాని తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తోంది. మిగిలిన మూడు సినిమాలు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతాయా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఆ మూడు సినిమాల ఓటీటీ డేట్లు ప్రకటించడం గమనార్హం. ఆ మూడు ఒకే వారంలో స్ట్రీమ్ అవుతూ ఉండడం కూడా మరింత ఆసక్తికరంగా మారింది. ఇక థియేటర్ల విషయంలో వీర సింహారెడ్డి జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.


ఈ సినిమా హాట్ స్టార్ వేదికగా ఫిబ్రవరి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత జనవరి 13వ తేదీన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయింది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రవితేజ మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పాత్రలో కనిపించగా ఆయన భార్య పాత్రలో కేథరిన్ నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా ఇప్పటికీ కొన్ని చోట్ల థియేటర్లలో ప్రదర్శిస్తూ మారుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.


ఇక తమిళంలో జనవరి 11వ తేదీన విడుదలైన వారిసు సినిమాని తెలుగులో వారసుడు పేరుతో జనవరి 14వ తేదీన విడుదల చేశారు దిల్ రాజు. తమిళంతో పోల్చుకుంటే తెలుగులో అంత హిట్ టాక్ రాక పోయినా పెట్టిన డబ్బులు అయితే వెనక్కి వచ్చాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ఈ సినిమా ఫిబ్రవరి 22వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. అలా సంక్రాంతి సందర్భంగా విడుదలైన పెద్ద సినిమాలు మూడు ఇప్పుడు ఒకే వారంలో అది కూడా రోజుల వ్యవధిలో ఓటీటీలోకి రాబోతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ముందుగా వారసుడు తర్వాత వీర సింహారెడ్డి ఆ తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాలు వరుసగా ఓటీటీలలో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. థియేటర్లలో ఈ సినిమాలో చూడని వారు ఓటీటీలో చూసేయండి మరి..


Also Read: Balakrishna vs Pawan: మొన్న అన్నతో ఈ సారి తమ్ముడితో.. బాలయ్య ఎక్కడా తగ్గట్లేదుగా!


Also Read: Taraka Ratna Biography: ప్రపంచంలో మరే హీరోకి సాధ్యం కాని రికార్డు.. పెద్దలను ఎదిరించి పెళ్లి.. తారకరత్న గురించి ఈ విషయాలు తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook