Santosh Shoban controversial comments on Dulquer Salmaan: అశ్వినీదత్ కు సంబంధించిన వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ నిర్మించిన సీతారామం అనే సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదలవుతోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా  ‘సీతారామం స్వరాలు’ పేరుతో సినిమా యూనిట్ ఒక మ్యూజికల్ కాన్సర్ట్ ప్రోగ్రామ్ షూట్ చేసి ఒక ఛానల్ లో ప్రసారం చేసింది. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తమ సోషల్ మీడియా ఖాతాలలో విడుదల చేసింది. ఈ వేడుకకు రౌడీ బాయ్ విజయ్  దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరవగా  స్వప్న సినిమాస్ బ్యానర్లో ‘అన్నీ మంచి శకునములే’ హీరోహీరోయిన్లు సంతోష్ శోభన్, మాళవిక నాయర్ కూడా హాజరయ్యారు.


యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవరిస్తూ వారిని వేదిక మీదకి రమ్మని పిలవడంతో సంతోష్ వచ్చి ‘మనలో మన మాట తెలుగు సినిమా చేయడానికి తెలుగు హీరోలు లేరా? ఎక్కడో మలయాళం నుంచి మమ్ముట్టి గారి కొడుకుని తీసుకురావాలా? అని ప్రశ్నిస్తాడు. అంతేకాక ఇప్పుడు చుడండి, దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో అయిపోయారు సరే తెలుగులో కొన్ని ప్రశ్నలు వేస్తా, దుల్కర్ సరైన సమాధానాలు చెప్తే తెలుగు హీరో అని ఒప్పుకుంటా అనడం ఆ తరువాత దుల్కర్.. శోభన్ అడిగిన అన్ని ప్రశ్నలకు తెలుగులో సమాధానం చెప్పడంతో సినిమాకు భాషతో సంబంధం లేదు అనేలా తాను తెలుగు నేర్చుకున్నాను అంటూ ఆయన చెప్పినట్టు అయింది. ఇక ఈ తాజాగా ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగబోతోంది. ప్రభాస్ ముఖ్యఅతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా చేస్తున్నారు.  


Read Also: Naga Chaitanya: శోభితతో డేటింగ్ పై ఓపెన్ అయిన నాగచైతన్య.. ఏమన్నారంటే?


Read Also: Karthikeya 2: మూవీ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మళ్లీ కార్తికేయ 2 వాయిదా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook