Sanya Malhotra : దీపావ‌ళి పండ‌గ‌కు త‌నకు తానే ఓ ఇంటిని గిఫ్ట్ ఇచ్చుకుంది దంగల్ బ్యూటీ సన్యా మల్హోత్రా(Sanya Malhotra). ముంబైలో ల‌గ్జ‌రీ ఇంటి(luxury house)ని కొనుగోలు చేసింది ఈ బాలీవుడ్ భామ‌. ఇది హీరో హృతిక్ రోష‌న్ ఇంటి ప‌క్క‌నే ఉండటం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స‌న్య ముంబైలో జుహు(Juhu area) ప్రాంతంలో నివ‌సిస్తున్న‌ స‌మీర్ భోజ్వానీ అనే వ్య‌క్తికి చెందిన ఇంటిని కొనుగోలు చేసింది. ఇది జుహు- వెర్సోవా లింక్ రోడ్‌లోని బేవ్యూ బిల్డింగ్‌లో ఉంది. స‌న్య‌, స‌న్య తండ్రి సునీల్ కుమార్ మల్హోత్రా రూ.14.3 కోట్లు వెచ్చించి ఆ ఇంటిని సొంతం చేసుకున్నారు. గ‌త నెల 14న ప్రాప‌ర్టీ ఆమె పేరుకు ట్రాన్స్‌ఫ‌ర్ అయిన‌ట్లు తెలుస్తోంది.


Also read: SURIYA JAI BHIM: హీరో సూర్యపై BJP నేత సంచలన వ్యాఖ్యలు.. సూర్య రియాక్షన్ అదుర్స్


గ‌తేడాది హృతిక్ రోష‌న్(Hrithik Roshan) 100 కోట్లు ఖ‌ర్చు పెట్టి ఇదే బిల్డింగ్‌లో రెండు అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశాడు. తాజాగా స‌న్యా కూడా ఈ భ‌వంతిలోనే ఇల్లు కొన‌డంతో ఆమె హృతిక్‌కు పొరుగింటి అమ్మాయిగా మారిపోయింది. ఇక దంగ‌ల్ సినిమాతో బాలీవుడ్‌(Bollywood)లో అడుగు పెట్టిన స‌న్య తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు అందుకుంది. 'ప‌టాకా', 'బ‌దాయి హో', 'శ‌కుంత‌ల దేవి', 'లూడో', 'ప‌గ్లైట్' వంటి ప‌లు సినిమాల్లో న‌టించిన స‌న్య ప్ర‌స్తుతం 'మీనాక్షి సుంద‌రేశ్వ‌ర్'(Meenakshi Sundareshwar) సినిమా చేస్తుంది. ఇది ఓటీటీలో రిలీజ్ కానుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook