SURIYA JAI BHIM: హీరో సూర్యపై BJP నేత సంచలన వ్యాఖ్యలు.. సూర్య రియాక్షన్ అదుర్స్

తమిళనాడు బీజేపీ నేత హెచ్.రాజా హీరో సూర్యను స్వార్థపరుడని విమర్శించారు. బీజేపీ నేత రాజా చేసిన ఈ ట్వీట్‌కు సూర్య నుంచి గట్టి కౌంటర్ పడుతుందని చాలామంది భావించారు.కానీ సూర్య మాత్రం లౌక్యంగా వ్యవహరించి వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2021, 12:06 PM IST
  • హీరో సూర్యపై ట్విట్టర్‌లో బీజేపీ నేత విమర్శలు
  • లౌక్యంగా వ్యవహరించిన హీరో సూర్య
  • సూర్య లౌక్యానికి నెటిజన్ల ఫిదా
  • వివాదానికి అక్కడితో ఫుల్ స్టాప్
SURIYA JAI BHIM: హీరో సూర్యపై BJP నేత సంచలన వ్యాఖ్యలు.. సూర్య రియాక్షన్ అదుర్స్

Hero Suriya is a Selfish Person Tamilnadu BJP Leader: కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా రియలిస్టిక్ అప్రోచ్‌తో సామాజిక ఇతివృత్తాలను తెరకెక్కించడం ఒక సాహసమనే చెప్పాలి.జనాలు దాన్ని ఆదరిస్తారా లేదా అంటే... నిజాయితీగా చేసే ప్రయత్నానికి వారి ఆదరణ తప్పక ఉంటుందని ఇటీవల విడుదలైన 'జైభీమ్' (JAI BHIM) సినిమా నిరూపించింది. సూర్య(SURIYA) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవగా... సినిమాకు అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. సూపర్ హిట్ టాక్‌‌తో సినిమా దూసుకెళ్తున్న వేళ... ఓ బీజేపీ నేత నుంచి సూర్యపై విమర్శలు రావడం హాట్ టాపిక్‌గా మారింది.

తమిళనాడు బీజేపీ నేత హెచ్.రాజా హీరో సూర్యను స్వార్థపరుడని విమర్శించారు. 'జాతీయ విద్యావిధానంలో భాగంగా మన పిల్లలు మూడు భాషల్లో విద్యను అభ్యసించడాన్ని వ్యతిరేకిస్తున్న వ్యక్తి అతని సినిమా(JAI BHIM)ను మాత్రం ఐదు భాషల్లో విడుదల చేస్తాడు. దీన్నిబట్టి అతనెంత స్వార్థపరుడో అర్థం చేసుకోవచ్చు. 'అంటూ హెచ్.రాజా ట్విట్టర్‌లో సూర్యపై విమర్శలు గుప్పించారు.

Also Read: Covid-19 cases in India: దేశంలో కొత్తగా 12,729 కరోనా కేసులు, 221 మరణాలు

బీజేపీ నేత రాజా చేసిన ఈ ట్వీట్‌కు సూర్య నుంచి గట్టి కౌంటర్ పడుతుందని చాలామంది భావించారు. కానీ సూర్య మాత్రం లౌక్యంగా వ్యవహరించి వివాదానికి అక్కడితోనే ఫుల్ స్టాప్ పడేలా చేశారు. రాజా చేసిన ట్వీట్‌ను లైక్ చేయడం ద్వారా ఆ వివాదం ఇక ముందుకు సాగకుండా చేశారు. సూర్య నటనకే కాదు, ఆయన లౌక్యానికి కూడా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రాజా ట్వీట్ పట్ల సూర్య పరిణతితో స్పందించారని... దీంతో వివాదానికి ఆస్కారం లేకుండా పోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే.. జైభీమ్(JAI BHIM) సినిమా పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. చంద్రు అనే పేద ప్రజల పక్షపాతి అయిన ఓ న్యాయవాది జీవిత కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. అమాయక, నిరుపేద గిరిజనులపై పోలీసులు సాగించే దాష్టికం, దౌర్జన్యాన్ని చిత్ర దర్శకుడు జ్ఞానవేల్ కళ్లకు కట్టినట్లు చూపించారు. సినిమాలో సినతల్లి పాత్రలో నటించిన లిజోమొల్ జోస్, రాజన్న పాత్రలో నటించిన మణికందన్‌లపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమాలో వారి నటనకు గాను జాతీయ అవార్డులు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Acharya Neelambari Song: ‘నీలాంబరి’ పాట వచ్చేసింది.. రామ్ చరణ్ డ్యాన్స్ అదిరిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News