Youtuber Sarayu Case Updates: బిగ్‌బాస్ 5 తెలుగు సీజన్‌ కంటెస్టెంట్, 7 ఆర్ట్స్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా పాప్‌లర్‌‌ అయిన సరయూ తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. సరయూపై ఇటీవల హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా ఫైల్ అయింది. గతంలో సరయూ నటించిన ఒక షార్ట్ ఫిల్మ్‌ హిందూ సంప్రదాయాల్ని దెబ్బతీసేలా ఉందంటూ కేసు నమోదైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు అశోక్ చేసిన కంప్లైట్ మేరకు సరయూపై ఈ కేసు ఫైల్ అయింది. దీంతో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీసులు సరయూను అదుపులోకి తీసుకుని విచారించారు. సరయూతో పాటు పాటు ఆమె షార్ట్‌ ఫిల్మ్‌ టీమ్‌ను కూడా పోలీసులు విచారించారు.


అయితే సరయూ పోలీసులకు పలు విషయాలపై వివరణ ఇచ్చింది. తమ షార్ట్‌ ఫిల్మ్‌లో అభ్యంతరాలున్న కంటెంట్‌ను తొలగిస్తామని పోలీసులకు సరయూ చెప్పింది. ఇప్పటికే ఆ వీడియోలో అభ్యంతరకరమైన సన్నివేశాలన్నింటినీ తాము తొలిగించామని సరయూ పోలీసులతో పేర్కొంది. 


అంతేకాదు ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. తాము క్షమాపణలు చెప్పేందుకు కూడా సిద్ధమంటూ సరయూ పోలీసులకు వివరణ ఇచ్చింది. ఒకవేళ ఆ వీడియోను మొత్తానికే డిలీట్ చెయ్యమన్నా కూడా చేస్తామని సరయూ టీమ్‌ పోలీసులకు వివరించింది. 


ఇక పిటిషనర్‌ అశోక్‌ కూడా బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు రానుండడంతో ఇరు వర్గాలను పోలీసులు (Police) ఒకేసారి విచారించనున్నారు. 


కాగా సరయూ 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్‌ రూపొందించిన చాలా వీడియోల్లో కీలక పాత్రల్లో నటించింది. సరయూ తన నటనతో, బోల్డ్‌నెస్‌తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే 7 ఆర్ట్స్‌ రెస్టారెంట్‌కు సంబంధించిన ఒక వీడియోలో సరయు, (Sarayu) టీమ్‌ మొత్తం తలకు గణపతి బొప్పా మోరియా అనే రిబ్సన్స్‌ ధరించి నటించడమే ఇప్పుడు వివాదానికి దారి తీసింది.
Also Read: POCO M4 Pro 5G: పొకొ నుంచి మరో బడ్జెట్ 5జీ ఫోన్​- ధర, ఫీచర్లు ఇవే..!


Also Read: Hijab controversy: హిజాబ్ వివాదం భయాలు- మూడు రోజులు స్కూళ్లు, కాలేజీలు బంద్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook