Heavy Police deployed at Charminar: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కాల్పుల ఘటన ప్రభావం హైదరాబాద్‌పై పడింది. నగరంలోని పాతబస్తీలో పోలీసులను భారీ ఎత్తున మోహరించారు. ముఖ్యంగా చార్మినార్, మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)ను రంగంలోకి దింపారు. ఒవైసీపై కాల్పుల ఘటన నేపథ్యంలో మజ్లిస్ పార్టీ మద్దతుదారులు నిరసనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
శుక్రవారం జుమ్మ నమాజ్ ప్రార్థనలు ఉండటంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. కాల్పుల ఘటనను నిరసిస్తూ ఒవైసీకి మద్దతుగా శుక్రవారం (ఫిబ్రవరి 4) పాతబస్తీలోని వ్యాపారులు స్వచ్చందంగా బంద్ పాటించారు. పలువురు నెటిజన్లు #LongLiveOwaisi హాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారు.
After #AIMIM chief & #Hyderabad MP #AsaduddinOwaisi ’s vehicle was shot at in #UttarPradesh, Heavy #Security deployed in old city, particularly around the #MeccaMasjid & in front of the #Charminar for friday prayer in wake of protest.
The Rapid Action Force (#RAF) also deployed pic.twitter.com/nrVFGqmwDP— Surya Reddy (@jsuryareddy67) February 4, 2022
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఢిల్లీ వెళ్తుండగా ఛాజర్సీ టోల్ గేట్ వద్ద ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. దుండగులు ఒవైసీ కాన్వాయ్‌పై 3-4 రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒవైసీ కాన్వాయ్‌లోని కారుకు బుల్లెట్లు దిగాయి. ఒవైసీకి ఎలాంటి హానీ జరగలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Tight security at #Charminar #Mecca #premises#AIMIM supporters called for protest pic.twitter.com/2HgWhTo6UM
— Shareef (@shareef_journo) February 4, 2022
ఈ కాల్పుల ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం ఒవైసీకి జడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. సీర్పీఎఫ్ బలగాలతో ఆయనకు భద్రత కల్పించనున్నారు.
Live from #Hyderabad #Charminar#AsaduddinOwaisi #LongLiveOwaisi pic.twitter.com/AAHWMrgsfh
— Muddasir Ahmed 🇮🇳 (@muddasirmiyan) February 4, 2022
Also Read: Zuckerberg Net Worth: మార్క్ జుకర్ బర్గ్‌కు ఒక్క రోజులో రూ.2.2 లక్షల కోట్ల లాస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook