Nani - Keerthy Suresh: నాచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలతో కెరియర్లో ఒక రేంజ్ లో ముందుకు దూసుకు వెళ్తున్నారు. 2023లో నాని దసరా, హాయ్ నాన్న అనే రెండు సినిమాల్లో నటించారు. ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఫిలింఫేర్ అవార్డుల నుంచి నేషనల్ అవార్డుల దాకా.. ఈ రెండు సినిమాలు బోలెడు అవార్డులను అందుకున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో నాని నెక్స్ట్ సినిమా అయినా సరిపోదా శనివారం సినిమా మీదే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ సినిమాతో నాని హ్యాట్రిక్ అందుకుంటారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ యాక్షన్ డ్రామా ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కాబోతోంది. 


ఇక నాని చేతిలో కూడా బోలెడు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి తన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా దసరాకి సీక్వెల్. దసరా 2 అని పిలవబడుతున్న ఈ సినిమాలో నిన్న మొన్నటిదాకా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది అని పుకార్లు వినిపించాయి. కానీ తాజాగా ఇప్పుడు దసరా సినిమాలు హీరోయిన్గా నటించిన కీర్తి సురేష్ ను ఈ సినిమాలో కూడా హీరోయిన్గా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తుంది. 


గతంలో కూడా నాని కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నేను లోకల్ అనే సినిమాలో నటించారు ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది ఇక ఈ మధ్యన దసరా కూడా సూపర్ హిట్ అయింది. దీంతో వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కి ఫాన్స్ ఫిదా అయిపోయారు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో దసరా 2 సినిమా లో వీళ్ళిద్దరి కాంబో రిపీట్ అవుతుంది అని సమాచారం. 


దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే అసలే హిట్ పెయిర్ కాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుంది అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. మరి సీక్వెల్ తో సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో ఎవరికీ చూడాలి.


Also Read: Big Shock To YSRCP: జగన్‌కు షాక్‌ల మీద షాక్‌.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా


Also Read: Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook