Heroine Priyanka Mohan Injured: అంగరంగ వైభవంగా జరుగుతున్న ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవం అకస్మాత్తుగా ప్రమాదం సంభవించింది. వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో స్టేజీపై ఉన్నవారంతా కిందపడిపోయారు. ఒకరిపై ఒకరు పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిలో ఓ ప్రముఖ హీరోయిన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఓ ఎమ్మెల్యేకు కూడా గాయాలయ్యాయని సమాచారం. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. కాగా ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Nani: కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం.. ఖండఖండాలుగా ఖండించిన హీరో నాని


 


మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. ప్రారంభోత్సవం సందర్భంగా 'సరిపోదా శనివారం' హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె చేతులమీదుగా షోరూమ్‌ను ప్రారంభించారు. అనంతరం స్టేజ్‌పై ప్రజలతో మాట్లాడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే స్టేజ్‌ కుప్పకూలింది. అకస్మాత్తుగా స్టేజ్‌ కూలడంతో స్టేజ్‌పై ఉన్నవారంతా కిందపడిపోయారు.

Also Read: Naga Chaitanya: మీ మాటలు బాధను కలిగించాయి.. చాలా సిగ్గునీయం: కొండా సురేఖపై నాగ చైతన్య ఫైర్‌


 


అయితే గాయపడిన వారిలో కాంగ్రెస్‌ పార్టీ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త, నాయకురాలు హనుమాండ్ల ఝాన్సి రెడ్డి ఉన్నారని సమాచారం. ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయని.. వెంటనే ఆమెను భద్రతా సిబ్బంది చేతులతో ఎత్తుకుని కారులో తీసుకెళ్లారు. వారు ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. అయితే హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ కిందపడిపోయినా కూడా గాయాలు కాలేదని నిర్వాహకులు చెబుతున్నారు. క్షేమంగా ఆమె బయట పడ్డారని సమాచారం.

వీడియో వైరల్
వేదికపైకి ఎక్కువ మంది ఎక్కడంతోనే ఒక్కసారిగా కుప్పకూలిందని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. జరిగిన ప్రమాదంపై ప్రియాంక మోహన్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆమె తన సామాజిక మాధ్యమాల ద్వారా క్షేమ సమాచారం తెలిపారని తెలుస్తోంది. కాగా ఈ సంఘటనపై పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి