మహేష్ బాబు బర్త్‌డే స్పెషల్ బ్లాస్టర్...`మాస్ కా బాప్` అంటున్న ఫ్యాన్స్
ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా `సర్కారు వారి పాట బ్లాస్టర్` పేరుతో స్పెషల్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో లుక్స్‌తో పాటు బాడీలాంగ్వేజ్‌తో అదరగొట్టాడు సూపర్ స్టార్.
Sarkaru Vaari Paata Blaster: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అభిమానులంతా ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న బర్త్ డే బ్లాస్టర్ వచ్చేసింది. ఆగస్టు 9 ఆయన పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే ట్రీట్ అందించాడు ప్రిన్స్.
ఇవాళ ఉదయం 9.09కు మహేష్(Mahesh Babu) నటిస్తున్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata )స్పెషల్ వీడియోను విడుదల చేయాల్సి ఉంది. కానీ అనుకున్న సమయం కంటే ముందుగానే సర్కారు వారి పాట బ్లాస్టర్(Sarkaru Vaari Paata Blaster) అంటూ వీడియో విడుదల చేసి ఫ్యాన్స్ కు గిప్ట్ ఇచ్చింది చిత్ర బృందం.
Also read: SarkaruVaariPaata: ఇటు బెల్ట్ టైట్.. అటు ఫాన్స్ అలర్ట్.. అదరగొట్టేసిన మహేష్
ఇక స్పెషల్ బ్లాస్టర్ వీడియో విషయానికి వస్తే.. 'ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా'.. అంటూ మహేష్ ఎంట్రీని అద్భుతంగా చూపించారు. 'ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్'’ అంటూ మహేష్(Mahesh Babu) చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. మొదట యాక్షన్ సీన్స్‌తోనే బ్లాస్టర్‌ను పేల్చేశారు చిత్ర యూనిట్. ‘'ఇఫ్ యూ మిస్ ద ఇంట్రస్ట్.. యువిల్ గెట్ యువర్ డేట్'’ అంటూ విలన్ గ్యాంగ్‌కి వార్నింగ్ ఇచ్చాడు మహేశ్.. ఆ తర్వాత హీరోయిన్ కీర్తి సురేశ్(Keerthi Suresh) మహేశ్‌కు హారతి ఇస్తూ ‘సార్ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్ఠి తీయడం మాత్రం మర్చిపోకండి’ అని చెప్పగానే, మహేశ్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
అనంతరం మహేష్‌లోని రొమాంటిక్ యాంగిల్‌ను చూపిచడంతో పక్కనే ఉన్న వెన్నెల కిషోర్(Vennela Kishore) ఆశ్చర్యపోయి చూస్తుండడం నవ్వులు తెప్పిస్తోంది. ఇక చివరిగా ‘ఏమోయ్ కిషోర్.. 'ఓ ఐదారు మూరలు ఉండవవి'’ అంటూ కీర్తి సురేష్(Keerthi Suresh) జడకు పెట్టుకున్న పూలపై పంచ్ అదిరిపోయేలా ఇచ్చి బ్లాస్టర్‌ను ముగించింది చిత్ర బృందం. ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.ఈ సినిమాను జీఎంబీ ప్రొడక్షన్స్, 14 రీల్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గీత గోవిందం లాంటి సంచలన బ్లాక్‌బస్టర్ తర్వాత పరశురామ్ (Parashuram) దాదాపు మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఇది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘సర్కారువారి పాట’ విడుదల కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook