SVP First Review: `సర్కారు వారి పాట` ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సింహంలా గర్జించిన మహేష్...
Sarkaru Vaari Paata First Review: మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న `సర్కారు వారి పాట` రిలీజ్‌కు ఇంకా మరికొద్ది గంటల సమయమే మిగిలి ఉంది. సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడగా... ఆ హైప్‌ను మరింత పెంచేలా రివ్యూ ఇచ్చాడు సినీ అనలిస్ట్ ఉమైర్ సంధు.
Sarkaru Vaari Paata First Review: మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాపై ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమాపై బాలీవుడ్ సినీ అనలిస్ట్ ఉమైర్ సంధు ట్విట్టర్‌లో తన రివ్యూ ఇచ్చాడు. ఓవర్‌సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే సంధు సర్కారు వారి పాట సినిమా చూసి రివ్యూ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. సినిమాలో మహేష్ నటన ఓ రేంజ్‌లో ఉందని... ఇప్పటివరకూ వచ్చిన మహేష్ సినిమాల్లో ఇది ది బెస్ట్ అని పేర్కొన్నాడు.
'సినిమాలో మహేష్ సింహంలా గర్జించాడు. షో అంతా మహేష్ బాబుదే. యాంగ్రీ నటనతో తెరపై మహేష్ కనిపించిన ప్రతీసారి... అతని కోపం తెరను కాల్చేసినట్లే ఉంది. ఈ సినిమాకు ఫుల్ పవర్ మహేష్ బాబే అనడంలో సందేహం అక్కర్లేదు. ఇప్పటివరకూ మహేష్ చేసిన సినిమాల్లో... ఇదీ ది బెస్ట్ అని చెప్పొచ్చు. సినిమా అంతా మహేష్ భుజాల పైనే నడుస్తుంది. మాస్ ప్రేక్షకులే టార్గెట్‌గా తీసిన ఈ సినిమా... బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం.' అని ఉమైర్ సంధు పేర్కొన్నాడు.
సర్కారు వారి పాటలో యాక్షన్, డ్రామా, కామెడీ, మహేష్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని ఉమైర్ సంధు పేర్కొన్నాడు. సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ చాలా అందంగా కనిపించిందని.. ఆమె నటన ఆకట్టుకుంటుందని ఉమైర్ సంధు తెలిపాడు. మహేష్ బాబుతో ఆమె కెమిస్ట్రీ సూపర్ హాట్ అని... ఇద్దరు పర్ఫెక్ట్ జంట అని అన్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే 2.55 కోట్ల బుకింగ్స్ జరిగాయని... అది మహేష్ బాబు పవర్ అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేయాల్సిందని... కేజీఎఫ్ 2, పుష్ప లాగా ఈ సినిమా హిందీలో బిగ్ హిట్ అయ్యేదని కామెంట్ చేశాడు.
కాగా, మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట' సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిశోర్, సముద్ర ఖని తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
Also Read: Surya Gochar 2022: సూర్యుని సంచారం కారణంగా రాశీచక్రంలో కలిగే మార్పులు ఏవో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook