Kalaavathi Song: మహేశ్‌ బాబు 'కళావతి' సాంగ్.. తమిళ్, హిందీ వెర్షన్ అదుర్స్..!

Kalaavathi Song: మహేశ్ బాబు‘'సర్కారు వారి పాట'’ చిత్రంలోని కళావతి సాంగ్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ తెలుగులో మాత్రమే హల్ చల్ చేసిన ఈ సాంగ్... ఇప్పుడు తమిళ్, హిందీ భాషల్లో కూడా వైరల్ అవుతోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2022, 02:48 PM IST
  • మహేశ్ బాబు‘ తాజా చిత్రం ‘'సర్కారు వారి పాట'’
  • మే 12న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్
Kalaavathi Song: మహేశ్‌ బాబు 'కళావతి' సాంగ్.. తమిళ్, హిందీ వెర్షన్ అదుర్స్..!

Kalaavathi Song: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata)’. కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'కళావతి' సాంగ్ (Kalaavathi Song) నెట్టింట దూసుకుపోతుంది. తక్కువ టైం లోనే 60 మిలియన్లకుపైగా వీక్షణలు అందుకున్న పాటగా రికార్డు క్రియేట్ చేసింది. అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాటను సిధ్‌ శ్రీరామ్‌ అలపించారు. భాష అర్థమవకపోయినా ఈ సాంగ్ అందరి మన్ననలను అందుకుంటుంది. 

తాజాగా ఈ సాంగ్ తెలుగు వెర్షన్ కాక.. తమిళ (Tamil Version), హిందీ వెర్షన్ లు కూడా వైరల్ అవుతున్నాయి. తెలుగు కళావతి ట్యూన్ నచ్చిన కొందరు.. ఆ సాంగ్ కు వారి వారి మాతృభాషల్లో సాహిత్యం సమకూర్చి..తమదైన శైలిలో ఆలపించారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ చేశారు. అంతే ఒక్కసారిగా ఒరిజినల్‌ పాటకు దీటుగా ఇవీ అందరి దృష్టిని ఆకర్షించాయి. యాక్షన్- కామెడీగా తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' చిత్రాన్ని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.  మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 

Also Read: Mahesh babu with Ali Bhatt: త్వరలో రాజమౌళి, అలియా భట్, మహేశ్ బాబు కాంబినేషన్ మూవీ, ఇవే ఆ వివరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News