SVP Twitter Review: ప్రేక్షకుల ముందుకొచ్చిన `సర్కారు వారి పాట`... ఇట్స్ మహేష్ వన్ మ్యాన్ షో..
Sarkaru Vaari Paata Review: ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు `సర్కారు వారి పాట` ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాపై ఓవర్సీస్ ఆడియెన్స్ తమ రివ్యూలను ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు.
Sarkaru Vaari Paata Review: సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా ప్రేక్షకుల ముందుకు రానే వచ్చేసింది. ఇప్పటికే ఓవర్‌సీస్‌లో ప్రీమియర్స్ పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు, మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా 'సర్కారు వారి పాట'పై తమ ఒపీనియన్‌ని షేర్ చేసుకుంటున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత వచ్చిన మహేష్ బొమ్మ ప్రేక్షకులను ఎంత మేర మెప్పించిందో ఇప్పుడు 'ట్విట్టర్' రివ్యూలో చూద్దాం...
'జర్మనీలో సర్కారు వారి పాట సినిమా చూశాను. మహేష్ నటన అదిరిపోయింది. మహేష్ స్టైల్, ఫైట్స్, డైలాగ్స్ పరంగా ఇదొక ట్రెండ్ సెట్టర్. కామెడీ, యాక్షన్ మేళవించిన రియాలిటీ మూవీ ఇది..' అని ఓ నెటిజన్ సినిమాపై తన రివ్యూని ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
'మహేష్ పెర్ఫామెన్స్‌కి ఫిదా అయిపోయాను. చాలా కొత్త మహేష్‌ని చూశాను. ఇట్స్ వన్ మ్యాన్ షో. సూపర్ స్టార్ ఎప్పుడూ ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేయరు. ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. ఎక్కడా బోర్ కొట్టదు...' అంటూ ఓ లేడీ ఫ్యాన్ ఇలా తన రివ్యూని షేర్ చేశారు.
'సినిమా డీసెంట్ ఎంటర్టైనర్. ప్రేక్షకులకు మాస్ జాతరే. మహేష్ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. కీర్తి సురేష్ చాలా అందంగా కనిపించింది. బాగా నటించింది. పాటలు, బీజీఎం మతి పోగొట్టేలా ఉన్నాయి. సినిమాకు రేటింగ్ 3.5.' అని మరో నెటిజన్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
'ఒక పోకిరి పండు గాడు... ఒక దూకుడు అజయ్... ఒక ఖలేజా సీతారామ రాజు.. ఒక సూర్యాభాయ్... అలాగే ఒక సర్కారు వారి పాట మహేష్.... గుర్తుండిపోయే పెర్ఫామెన్స్. ఫ్యాన్స్‌కి ఏ టైమ్‌లో ఏం కావాలో అదిచ్చావు...' అంటూ మహేష్ ఫ్యాన్ ఒకరు తన ట్వీట్‌లో సినిమా గురించి చాలా ఎగ్జయిటింగ్‌గా చెప్పుకొచ్చాడు.
'మహేష్ మొదటి నుంచి చివరి వరకు సినిమాను తన భుజాలపై మోశాడు. ఇటీవలి కాలంలో మహేష్ బెస్ట్ పెర్ఫామెన్స్ కనబర్చిన సినిమా. ముఖ్యంగా కామెడీ సీన్స్‌లో. తమన్ బీజీఎం కొన్నిచోట్ల మాత్రమే ఆకట్టుకునేలా ఉంది. ఫస్టాఫ్‌తో పాటు ఫైట్స్‌లోనూ ఆ బీజీఎం ఉంటే బాగుండు అనిపించింది.' అంటూ ఓ నెటిజన్ తన ఒపీనియన్‌ని షేర్ చేశాడు.
మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్‌తో ఆయన నుంచి వచ్చిన సినిమా ఇది. అటు దర్శకుడు పరశురాం గీత గోవిందం బ్లాక్ బ్లస్టర్ హిట్ తర్వాత తెరకెక్కించిన సినిమా. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై హైప్‌ని పెంచేశాయి. సినిమా పోకిరికి మించి ఉంటుందని చిత్ర యూనిట్ చెప్పడం అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఎట్టకేలకు ఇవాళ మహేష్ సర్కారు వారి పాట విడుదలవడంతో ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. మహేష్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించాయి.
Also Read: Sarkaru vaari paata collection prediction : కేజీఎఫ్2ను మించిన 'సర్కారు వారి పాట' బుకింగ్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook