SVP Song Leak: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన తమన్.. తనవల్ల కావట్లేదంటూ ఎమోషనల్..
Thaman on Sarkaru Vari Pata song leak: `సర్కారు వారి పాట` సినిమాలోని `కళావతి` సాంగ్ లీక్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ని తీవ్రంగా కలచివేసింది. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు సారీ చెబుతూ తాజాగా తమన్ వాయిస్ మెసేజ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
Thaman on Sarkaru Vari Pata song leak: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట' సినిమాను లీకుల బెడద వెంటాడుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని 'కళావతి' అనే సాంగ్ లిరికల్ వీడియో యూట్యూబ్‌లో లీకవడంతో మేకర్స్ తలపట్టుకున్నారు. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేయగా.. ఉన్నట్టుండి అది యూట్యూబ్‌లో ప్రత్యక్షమవడం చిత్ర యూనిట్‌ను కలవరపెడుతోంది. 'కళావతి' సాంగ్ లీకుపై తాజాగా ట్విట్టర్‌లో స్పందించిన తమన్ చాలా ఎమోషనల్ అయ్యారు.
'మనసుకు చాలా బాధగా ఉంది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆర్నెళ్లుగా ఈ లిరికల్ వీడియో కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడ్డాం. ఈ క్రమంలో 9 మందికి కరోనా పాజిటివ్ కూడా వచ్చింది. మేము మా హీరోకి చూపించాల్సిన ప్రేమ, మా పాటలో ప్రాణం, మా కవి రాసిన లిరిక్స్.. మా డైరెక్టర్ ఎంతో ఉత్సాహంగా చేసిన వీడియో... వరల్డ్‌లోనే బెస్ట్ టెక్నాలజీతో ఈ సాంగ్‌ను చేస్తే.. అంత ఈజీగా ఎవడో లీక్ చేశాడు. వాడికి పని ఇస్తే.. ఈ పని చేస్తాడనుకోలేదు. గుండె అంతా తరుక్కుపోతోంది.. లైఫ్‌లో ఎన్నో ఎదుర్కొన్నా.. కానీ ఈ విషయంలో చాలా బాధపడుతున్నా. పైరసీ అనేది ఎంత ఘోరమైన విషయమనేది వాడికి అర్థం కావడానికే ఈ వాయిస్ మెసేజ్.' అని తమన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
'కళావతి' సాంగ్ కోసం దాదాపు 1000 మంది పనిచేశారని తమన్ పేర్కొన్నాడు. అంతమంది కష్టపడ్డ ఈ లిరికల్ వీడియో లీకవడం తనవల్ల కావట్లేదన్నాడు. మూవీ టీమ్ తరుపున ఫ్యాన్స్‌కు సారీ చెబుతున్నట్లు తెలిపాడు. మున్ముందు ఇంకా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రామిస్ చేస్తున్నానని అన్నాడు. త్వరగా ఈ పాటను విడుదల చేస్తామని చెప్పుకొచ్చాడు.
కాగా, మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: AP Cabinet Reshuffle: ఏపీలో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ముహూర్తం ఖరారు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook